PM Kisan 23rd Installment | రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: PM Kisan 23rd Installment | దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో భాగంగా 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, బటన్ నొక్కి మొత్తం రూ. 18,880 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు.

PM Kisan 23rd Installment | పథకం వివరాలు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 నగదు అందుతోంది. ఈ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ వేడుకలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఉత్సవాల్లో పాల్గొని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

PM Kisan 23rd Installment | నిబంధనలు ..

ఉత్తరప్రదేశ్‌లో రైతు గుర్తింపు కార్డు (Farmer ID) లేని రైతులకు కూడా ఈసారి నిధులు విడుదలయ్యాయి. యూపీలో దాదాపు 2.17 కోట్ల మంది రైతులకు రూ. 4,352 కోట్ల సాయం అందనుంది. నిబంధనల ప్రకారం ఐడీ కార్డులు లేని కారణంగా యూపీలో సుమారు 50 లక్షల మందిని, బీహార్‌లో 34 వేల మందికి పైగా రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

PM Kisan 23rd Installment | డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?

ఖాతాల్లో జమైన డబ్బులను రైతులు సులభంగా పొందవచ్చు. ఇందుకోసం డిజీపే (DigiPay), డిజీపే లైట్ (DigiPayLite) యాప్‌లను లేదా సమీపంలోని ఎఫ్‌పీఓ (FPO), పీఏసీఎస్ (PACS) కేంద్రాలను ఆశ్రయించవచ్చని అధికారులు సూచించారు. రైతులు తమ ఖాతాలో డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను సందర్శించాలి. అక్కడ ‘Know Your Status’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. మీ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే వివరాలు కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి:  Maharashtra Temple Collapse | మహారాష్ట్రలో విషాదం.. మండపం కూలి ఆరుగురు మృతి!

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *