అక్షరటుడే వెబ్‌డెస్క్: Maharashtra Temple Collapse | మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పర్బనీ జిల్లాలోని మానవత్ తాలూకా యశ్వాడి గ్రామంలో ఉన్న ప్రముఖ హనుమాన్ ఆలయ సభా మండపం (బయటి హాల్) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం. మరికొంత మంది భక్తులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Maharashtra Temple Collapse | పెరిగిన భక్తుల రద్దీ..
నిర్మాణంలో ఉన్న ఈ ఆలయ సభా మండపంలో ఒక ధార్మిక కార్యక్రమం జరుగుతుండగా శనివారం మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. సాధారణంగా శనివారం హనుమంతునికి విశేషమైన రోజు కావడంతో, స్వామివారిని దర్శించుకోవడానికి , పూజల్లో పాల్గొనడానికి పరిసర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ కిందపడటంతో ఈ ఘోర అపశృతి జరిగింది.
Maharashtra Temple Collapse | కొనసాగుతున్న సహాయక చర్యలు ..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు , జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 25 మందికి పైగా భక్తులను రెస్క్యూ టీమ్‌లు విజయవంతంగా వెలికితీశాయి. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం . ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా, బాధితులకు , మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మేఘనా బోర్డికర్ హామీ ఇచ్చారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పర్బనీ జిల్లాలోని యశ్వాడి హనుమాన్ ఆలయం మండపం కూలి అపశృతి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మరి కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
— Akshara Today | Telugu News (@aksharatoday) June 20, 2026
ఇది కూడా చదవండి: Save The Tigers 3 Review | టైగర్స్ మళ్లీ గర్జించారు: వినోదం, ఫాంటసీల మేళవింపుగా ‘సేవ్ ద టైగర్స్-3’!