TPCC Nizamabad Appointments | టీపీసీసీ సంచలన నిర్ణయం..నిజామాబాద్ జిల్లాలో కీలక నియామకాలు రద్దు

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చేపట్టిన పార్టీ నియామకాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వెనక్కి తగ్గింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: TPCC Nizamabad Appointments | నిజామాబాద్ జిల్లాలో ఇటీవల చేపట్టిన పార్టీ నియామకాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వెనక్కి తగ్గింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

TPCC Nizamabad Appointments | డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ..

గత మే 30, 2026న నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ , ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, తాజాగా ఆ నియామకాలను రద్దు చేస్తూ లేదా నిలిపివేస్తూ (kept in abeyance) టీపీసీసీ స్పష్టం చేసింది.

pcc.2 3

TPCC Nizamabad Appointments | తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు..

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ టి. కుమార్ రావు సంతకంతో జూన్ 18, 2026న విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు చెల్లవని పార్టీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ విషయంలో తదుపరి ఆదేశాలను త్వరలోనే జారీ చేస్తామని, సంబంధిత నేతలకు సమాచారం అందిస్తామని లేఖలో పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణకు ఈ మేరకు టీపీసీసీ నుంచి సమాచారం అందింది. పార్టీలో అంతర్గత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే కొత్త నియామకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  Save The Tigers 3 Review | టైగర్స్ మళ్లీ గర్జించారు: వినోదం, ఫాంటసీల మేళవింపుగా ‘సేవ్ ద టైగర్స్-3’!

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *