తెలంగాణCongress SC Cell | కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ రాష్ట్ర కమిటీ నియామకం..

Congress SC Cell | కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ రాష్ట్ర కమిటీ నియామకం..

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీని నియమించింది. ఈ మేరకు ఎస్సీ సెల్​ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress SC Cell | కాంగ్రెస్ పార్టీ ​ (Congress Party) SC సెల్ రాష్ట్ర కమిటీని నియమించింది. ఈ మేరకు ఎస్సీ సెల్​ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గతంలోనే డీసీసీలను నియమించిన కాంగ్రెస్​ తాజాగా ఎస్సీ సెల్​ రాష్ట్ర కమిటీని నియామకం పూర్తి చేసింది. ఈ కమిటీలో 16 మంది వైస్​ ఛైర్మన్లు, 9 మంది జనరల్ సెక్రెటీరీలు, 29 మంది సెక్రెటరీలు 29 ఉంటారు. అలాగే 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన ఎస్సీ సెల్ చైర్మన్ నియమించారు.

Congress SC Cell | పార్టీ బలోపేతం కోసం..

కాంగ్రెస్​లో కష్టపడే వారికి పదవులు లభిస్తాయని కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కొత్తగా పదవులు పొందిన వారు పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పేర్కొన్నారు.

Congress SC Cell | జిల్లా ఛైర్మన్లు వీరే..

రాష్ట్రంలోని 27 జిల్లాలకు కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ అధ్యక్షులను తాజాగా నియమించారు. ఆదిలాబాద్​–పరమేశ్వర్​, మంచిర్యాల – నర్సింలు, నిర్మల్​ – కట్ట శ్యాం సుందర్​, ఆసిఫాబాద్ – దుర్గం హంసరాజు, కరీంనగర్​ – కొరివి అరుణ్​ కుమార్, జగిత్యాల – దుమాల రాజుకుమార్​, సిరిసిల్ల – పండుగ ప్రదీప్​, కామారెడ్డి – బూమాని బాల్​రాజ్​, హన్మకొండ – ఆరూరి సాంబయ్య, వరంగల్ – చిలువేరు శ్రీనివాస్​, జనగామ – చేపూరి వినోద్​, సంగారెడ్డి– శ్రీహరి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కరుణాకర్​ నియామకం అయ్యారు.

ఇది కూడా చదవండి..: Ponguleti Comments | బీఆర్​ఎస్​లో హరీశ్​రావు ఫ్యూచర్​ ఏంటో.. పొంగులేటి కౌంటర్​

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

AI Complaint App | ఏఐతో ఫిర్యాదుల నమోదు.. హైదరాబాద్​ పోలీసుల కీలక అడుగు

అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Complaint App | హైదరాబాద్ పోలీసులు (Hyderabad...

Bajaj Pulsar N160 | బజాజ్ పల్సర్ కొత్త వేరియంట్ లాంచ్ ..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bajaj Pulsar N160 | భారతదేశ టూ వీలర్...

Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో న్యాయవాది హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Lawyer Murder | హైదరాబాద్​లో ఓ న్యాయవాది...

POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: POLYCET Results | తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి....