POLYCET Results | పాలిసెట్​ ఫలితాలు విడుదల

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: POLYCET Results | తెలంగాణ పాలిసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్​ కాలేజీ (Polytechnic College)ల్లో ప్రవేశాల కోసం మే 13న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

27 నుంచి కౌన్సెలింగ్​

టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన పాలిసెట్​ ఫలితాలను శనివారం ఉదయం విడుదల చేశారు. ఈ పరీక్షకు 98,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్​ టికెట్ నంబర్​, పుట్టిన తేది వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్​ చేసుకోవచ్చు. రెండు విడతల్లో కాలేజీల్లో సీట్లను భర్తీ చేయడానికి ఇప్పటికే అధికారులు షెడ్యూల్​ విడుదల చేశారు. మొదటి విడత కౌన్సెలింగ్​ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 82.84 శాతం విద్యార్థులు పాస్​ అయ్యారు. బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఇది కూడా చదవండి..: TGPOLYCET Results 2026 | రేపు పాలిసెట్​ ఫలితాల విడుదల

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *