ACB Raid | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

నిర్మల్​ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ సెక్షన్​ ఆఫీసర్​ రవీందర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | నిర్మల్ (Nirmal)​ జిల్లా ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్​ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సెక్షన్​ ఆఫీసర్ (Forest Section Officer)​ ఐండ్ల రవీందర్​ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్​గా దొరికాడు.

సెక్షన్​ పరిధిలో ఓ వ్యక్తికి చెందిన టింబర్​ డిపో లైసెన్స్​ రెన్యువల్ కోసం ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​ రవీందర్​ రూ.12 వేల లంచం డిమాండ్​ చేశాడు. డబ్బులు ఇస్తేనే లైసెన్స్ పునరుద్ధరణ కోసం తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపి, అధికారికంగా సహాయం చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి సెక్షన్​ ఆఫీసర్​ రవీందర్​ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

ACB Raid | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచించారు. ఎంత మొత్తం అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్​ ఫ్రీ నంబర్​ 1064కు ఫోస్తే అవినీతి అధికారుల ఆట కట్టిస్తామన్నారు. లంచం ఇస్తే తమ పనులు చేయకుండా అధికారులు వేధిస్తారనే భయం వద్దన్నారు. ఆ పని పూర్తయ్యే వరకు ఏసీబీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దీనిని కూడా చదవండి : BMW Employee Gifts | ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్.. యజమానిపై నెటిజన్ల ప్రశంసలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *