Kaushik Reddy Sajjanar | సజ్జనార్‌ను వదిలిపెట్టేది లేదన్న కౌశిక్ రెడ్డి.. తీవ్రంగా ఖండించిన పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత , బెదిరింపు వ్యాక్యలపై పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kaushik Reddy Sajjanar | హైదరాబాద్  ( Hyderabad ) సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత , బెదిరింపు వ్యాక్యలపై పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (హైదరాబాద్ సిటీ యూనిట్) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

Kaushik Reddy Sajjanar | హెచ్చరికల నేపథ్యం..

వినాయక నిమజ్జనోత్సవాల సందర్భంగా రాజకీయ పాటలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సజ్జనార్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పాటలపై నిషేధం విధించేందుకు సజ్జనార్‌ ఎవరు? ఆయన ఏమైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు సజ్జనార్‌ ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని, ఆయన తాట తీస్తానంటూ వివాదాస్పద హెచ్చరికలు చేశారు.

Kaushik Reddy Sajjanar | పోలీసుల హెచ్చరికలు..

బాధ్యతాయుతమైన సీనియర్ ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి “నీ అంతు చూస్తా”, “రిటైర్ అయిన తర్వాత కూడా వదలను” అంటూ పరుష పదజాలంతో బెదిరించడం ఎంతమాత్రం తగదని అసోసియేషన్ స్పష్టం చేసింది. సజ్జనార్ సమర్థవంతమైన సారథ్యంలో హైదరాబాద్ పోలీసులు శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడింది. ఇలాంటి ఉన్నతాధికారులపై వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల రాష్ట్రంలోని పోలీసు సిబ్బంది మొత్తం మనోధైర్యం, ఆత్మగౌరవం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

Kaushik Reddy Sajjanar | చట్టప్రకారమే విధులు..

ప్రజాప్రతినిధులు, పోలీసులు ఇద్దరూ ప్రజలకు సేవ చేసే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని అసోసియేషన్ గుర్తుచేశారు. అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంటే వాటిని చట్టబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలి తప్ప బెదిరింపులకు తావు ఉండకూడదని సూచించారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా, చట్టం ప్రకారం తమ విధులు నిర్వర్తించేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  ECI SIR Hearing | ఎన్నికల సంఘం అత్యవసర భేటీ.. SIR పై కీలక నిర్ణయం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *