అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Fee Reimbursement | తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం (Telangana) పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు, కార్యకర్తలు సెక్రటరియేట్ వైపు దూసుకొచ్చారు. భద్రతా బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నేతల అదుపులోకి..
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను బలవంతంగా అడ్డుకుని చెదరగొట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Telangana Fee Reimbursement | రాజీనామా చేయాలని డిమాండ్..
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని, దీనివల్ల సుమారు 40 లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుతున్న విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.
#WATCH | Hyderabad | Telangana BJP State President Ramchander Rao, along with MPs, MLAs and BJYM leaders, staged a protest at the Telangana State Secretariat in Hyderabad, demanding permission to enter and submit a representation to Telangana Chief Minister Revanth Reddy… pic.twitter.com/mCUudJ8SdQ
— ANI (@ANI) September 3, 2026
ఇది కూడా చదవండి..: ED Money Laundering | డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ పంజా.. రూ.150 కోట్ల అక్రమాస్తులపై మనీలాండరింగ్ కేసు నమోదు!