Krishna Water Protest | కృష్ణ జలాల కోసం టీఆర్​ఎస్​ పోరుబాట

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Krishna Water Protest | తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరుబాట పట్టనున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తూ పార్టీ విస్తరణకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 8న చౌదరిగూడెం వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru – Rangareddy Project) సాధన సభ నిర్వహించనున్నారు.

కవిత పాలమూరు నుంచే రాజకీయంగా మొదటి అడుగు వేయనున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ముందుకు సాగుతానని ఆమె గతంలో ప్రకటించారు. ఈ మేరకు ఈనెల 8న కృష్ణా జలాల సాధన కోసం ఆందోళన నిర్వహించనున్నారు. 8న ఉదయం జోగులాంబ అమ్మవారిని కవిత దర్శనం చేసుకుంటారు. సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు.

Krishna Water Protest | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 11 ఏళ్లు గడిచిన తర్వాత కూడా 50 శాతం పనులు పూర్తి కాలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సత్వర అనుమతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. తెలంగాణకు హక్కుగా దక్కే ప్రతి చుక్క నీటిని మన బీడు భూములకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Krishna Water Protest | పోస్టర్ ఆవిష్కరణ

కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరి గూడెం వద్ద కవిత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పోస్టర్​ను సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్, సీమ రమేశ్, బుచ్చిబాబు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Kukatpally Couple Suicide| కూకట్‌పల్లిలో విషాదం.. పెళ్లైన 55 రోజులకే నవదంపతుల ఆత్మహత్య!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *