తెలంగాణKukatpally Couple Suicide| కూకట్‌పల్లిలో విషాదం.. పెళ్లైన 55 రోజులకే నవదంపతుల ఆత్మహత్య!

Kukatpally Couple Suicide| కూకట్‌పల్లిలో విషాదం.. పెళ్లైన 55 రోజులకే నవదంపతుల ఆత్మహత్య!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Kukatpally Couple Suicide| హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. వివాహమైన రెండు నెలలు కూడా గడవకముందే ఓ నవదంపతులు విగతజీవులుగా మారడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Kukatpally Couple Suicide| పెళ్లైన 55 రోజులకే అనంత లోకాలకు..

కూకట్‌పల్లి కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28), మంజుల (27)లకు గత మార్చి 8వ తేదీన వివాహమైంది. కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా, మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తూ ఉండేవారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ జంట, పెళ్లైన 55 రోజులకే బలవన్మరణానికి పాల్పడ్డారు.

Kukatpally Couple Suicide| అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఒక శుభకార్యానికి హాజరైన ఈ దంపతులు, అనంతరం మంజుల పుట్టింటికి వెళ్లి వచ్చారు. రాత్రి భోజనం చేసిన తర్వాత తమ గదిలోకి వెళ్లి నిద్రపోయారు. శనివారం ఉదయం ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడం, ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కార్తీక్ వెంటిలేటర్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. మంజుల మంచంపై నోటి వెంట నురగలు వచ్చి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Kukatpally Couple Suicide| మిస్టరీగా మారిన కారణాలు..

సంతోషంగా ఉన్న దంపతులు ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. మంజుల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన కొడుకు, కోడలు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇది కూడా చదవండి: Tamil Nadu Election Shock | కొళత్తూరులో స్టాలిన్ ఢమాల్.. చెపాక్‌లో ఉదయనిధి పోరాటం!

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Bengal Victory|పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా...

Kamareddy Municipal Commissioner | కామారెడ్డి,ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ల బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి: Kamareddy Municipal Commissioner | కామారెడ్డి జిల్లా (Kamareddy...

CPO Teachers Issue | సీపీవోలుగా ఉపాధ్యాయులను సమంజసం కాదు

అక్షరటుడే, కామారెడ్డి: CPO Teachers Issue | రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో...

Kamareddy Fire Victims | బాధితులను ఆదుకుంటాం: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Victims | పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద...