Telangana SIR | రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రారంభం

తెలంగాణలో నేటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రారంభం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana SIR | తెలంగాణ (Telangana)లో నేటి నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభం అయింది. జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు BLOలు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్నారు. ఈ పత్రాలను నింపి జూలై 24 వరకు తిరిగి BLOలకు అందజేయాల్సి ఉంటుంది.

బీఎల్​వో (BLO)లు ఇంటింటికి వెళ్లనున్నారు. సగటున వెయ్యి మంది ఓటర్లకు ఒక బీఎల్​వోను నియమించారు. వివరాల కోసం బీఎల్​వోలు మూడుసార్లు ఇళ్లకు వెళ్లనున్నారు. బీఎల్వోలు ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారాలు నింపి ఇస్తేనే ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. లేదంటే ఓటు హక్కు తొలగిస్తారు. ఎస్​ఐఆర్​ ప్రక్రియ జులై 24న ముగుస్తుంది. అనంతరం అదే నెల 31న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు.

Telangana SIR | అభ్యంతరాలకు అవకాశం

Telangana SIR

డ్రాఫ్ట్​ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ఆగస్టు 30 వరకు గడువు ఉంది. అనంతరం ఎన్నికల కమిషన్ నోటీసు ఇస్తే 12 ఆధారాల్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబరు 1న తుది జాబితా ప్రకటిస్తారు.

ఇది కూడా చదవండి..: Rain Forecast | నేడు పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *