Bakery Fire Accident | బేకరీలో అగ్నిప్రమాదం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం

కొమురంభీమ్​ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీలో షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bakery Fire Accident | కొమురంభీమ్​ ఆసిఫాబాద్ జిల్లా (Asifabad District) కాగజ్​నగర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఓ బేకరీలో మంటలు చెలరేగాయి.

కాగజ్​నగర్​ పట్టణంలోని బెంగుళూరు అయ్యంగార్​ బేకరీలో ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బేకరీ యజమానులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Bakery Fire Accident | కారు దగ్ధం

ఖమ్మం జిల్లా పరిధిలోని వేంసూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే లింగపాలెం ఎగ్జిట్ వద్ద కారు దగ్ధమైంది. కారు టైర్ పేలి, రైలింగ్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిబూడిద అయింది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ కారులోని ఏడుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇది కూడా చదవండి..: Telangana SIR | రాష్ట్రంలో ఎస్​ఐఆర్​ ప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *