SI Suspended | ఎస్సై సస్పెండ్​.. సంబరాలు చేసుకున్న ప్రజలు

వరంగల్ పోలీస్​ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ ఎస్సై మహేందర్​ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Suspended | వరంగల్ (Warangal) పోలీస్​ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ ఎస్సై (Nekkonda SI) మహేందర్​ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపి, చర్యలు తీసుకున్నారు.

ఎస్సై మహేందర్​పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సివిల్ వివాదాల్లో తలదూర్చినట్లు సమాచారం. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఆయనపై ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా గొర్రెల కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల వ్యవహారంలో ఆయన తలదూర్చారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీపీ శ్వేతారెడ్డి (CP Swetha Reddy) విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించినా, క్రమశిక్షణకు భంగం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

SI Suspended | సీపీ చిత్రపటానికి పాలాభిషేకం

ఎస్సై మహేందర్​ను సస్పెండ్ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అంతేగాకుండా సీపీ శ్వేతారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Balakrishna Injury | షూటింగ్‌లో బాలకృష్ణకు గాయాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *