అక్షరటుడే వెబ్‌డెస్క్: Uday Krishna Reddy | మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Uday Krishna Reddy | తప్పుడు కేసు బనాయించారు..
తనపై మోపబడిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, కావాలనే తనపై తప్పుడు కేసు బనాయించారని ఉదయ్ కృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, తనపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం రేపు ఉదయం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Uday Krishna Reddy | శిక్షణ సమయంలో లైంగిక వేధింపులు..
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో (SVPNPA) శిక్షణ సమయంలో తనను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ కర్ణాటకకు చెందిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదు కావడంతో సోమవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మోతీనగర్‌లోని తన బంధువు ఇంటికి వచ్చిన ఆయన హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించగా, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
తనపై నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషన్ దాఖలు
బుధవారం విచారణ చేపట్టనున్న హైకోర్టుTrainee IPS Uday Krishna Reddy Moves High Court
Trainee IPS officer Uday Krishna Reddy has approached the High Court, filing a petition seeking… pic.twitter.com/p2iF5oQp5P
— Akshara Today | Telugu News (@aksharatoday) July 21, 2026
ఇది కూడా చదవండి: SI Suspended | ఎస్సై సస్పెండ్.. సంబరాలు చేసుకున్న ప్రజలు