Plasma Exchange Treatment | అరుదైన టీటీపీతో బాధపడుతున్న గర్భిణి..ప్లాస్మా ఎక్స్ఛేంజ్‌తో ప్రాణాలు నిలిపిన యశోద బృందం

ఈ కేసు ద్వారా అరుదైన వ్యాధుల విషయంలో నిపుణుల తక్షణ జోక్యం, వివిధ వైద్య విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోందని డా. విక్రమ్ కుమార్ పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Plasma Exchange Treatment | అరుదైన రక్త వ్యాధి థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా (టీటీపీ)తో బాధపడుతున్న గర్భిణికి సకాలంలో చికిత్స అందించి తల్లీబిడ్డ ప్రాణాలను యశోద ఆస్పత్రి వైద్య బృందం కాపాడింది.

చికిత్సలో భాగంగా థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్, స్టెరాయిడ్ థెరపీని అందించి గర్భిణి ఆరోగ్యాన్ని మెరుగుపరిచినట్లు యశోద ఆస్పత్రి కన్సల్టెంట్ క్లినికల్ హేమటాలజిస్ట్, బీఎంటీ ఫిజీషియన్ డా. జి. విక్రమ్ కుమార్ తెలిపారు.

Plasma Exchange Treatment | ఆస్పత్రి హెమటాలజీ బృందం

కామారెడ్డి Kamareddy పట్టణంలోని యశోద Yashoda బ్రాంచ్ మెడికల్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

నిజామాబాద్‌కు చెందిన గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరగా.. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి హెమటాలజీ బృందం వెంటనే పరీక్షలు నిర్వహించి టీటీపీగా నిర్ధారించినట్లు తెలిపారు.

Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

Plasma Exchange Treatment | స్టెరాయిడ్ థెరపీ

నిర్ధారణ అనంతరం ఆలస్యం చేయకుండా థెరప్యూటిక్ ప్లాస్మా ఎక్స్ఛేంజ్‌తో పాటు స్టెరాయిడ్ థెరపీని ప్రారంభించినట్లు చెప్పారు. టీటీపీ చికిత్సలో ప్లాస్మా ఎక్స్ఛేంజ్ అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రధాన చికిత్సా విధానమని వివరించారు.

చికిత్సకు గర్భిణి అద్భుతంగా స్పందించడంతో ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా మెరుగుపడిందని, ప్రస్తుతం గర్భం సురక్షితంగా కొనసాగుతోందని తెలిపారు.

తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, హెమటాలజీ, గైనకాలజీ వైద్య బృందాల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని డా. విక్రమ్ కుమార్ వెల్లడించారు.

Plasma Exchange Treatment | అరుదైన రక్త వ్యాధి టీటీపీ

టీటీపీ అనేది శరీరంలోని చిన్న రక్తనాళాల్లో సూక్ష్మ రక్తం గడ్డలు ఏర్పడే అరుదైన రక్త సంబంధిత వ్యాధి. దీనివల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటు ఎర్ర రక్త కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా మెదడు, మూత్రపిండాలు, గుండె వంటి కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని డా. విక్రమ్ వివరించారు.

Plasma Exchange Treatment | త్వరగా గుర్తించడం కీలకం..

గర్భధారణ సమయంలో టీటీపీ లక్షణాలు ఇతర గర్భ సంబంధిత సమస్యల లక్షణాలతో పోలి ఉండే అవకాశం ఉన్నందున వ్యాధిని త్వరగా గుర్తించడం అత్యంత కీలకమన్నారు. చికిత్సలో ఆలస్యం జరిగితే తల్లీబిడ్డ.. ఇద్దరికీ ప్రాణాపాయం ఏర్పడే ప్రమాదం ఉంటుందని తెలిపారు.

Plasma Exchange Treatment | బృందాల సమన్వయంతో

ఈ కేసు ద్వారా అరుదైన వ్యాధుల విషయంలో నిపుణుల తక్షణ జోక్యం, వివిధ వైద్య విభాగాల మధ్య సమన్వయం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోందని డా. విక్రమ్ కుమార్ పేర్కొన్నారు.

అధునాతన డయాగ్నస్టిక్స్, ప్లాస్మా ఎక్స్ఛేంజ్ సౌకర్యాలు, బహుళ విభాగాల వైద్య బృందాల సమన్వయంతో ఈ చికిత్స విజయవంతమైందన్నారు.

గత మూడు దశాబ్దాలుగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్‌పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నాలుగు స్వతంత్ర ఆస్పత్రులతో మొత్తం 4,000 పడకల సామర్థ్యంతో అరుదైన, సంక్లిష్టమైన వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *