Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ఘరానా మోసం.. రూ.కోటి స్వాహా

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gupta Nidhula Mosam | గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఇళ్ల కింద పురాతన నిధులు ఉన్నాయని నమ్మిస్తూ.. పూజలు చేస్తే గుంతల్లో పాతిపెట్టిన బొగ్గు బంగారంగా మారుతుందని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా ఇప్పటివరకు 11 మందిని మోసం చేసి సుమారు రూ.1 కోటి వరకు స్వాహా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Gupta Nidhula Mosam | పూజల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు..

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు ముందుగా బాధితులను కలిసి వారి ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయాలని చెప్పి, ఇంటి పరిసరాల్లో గుంతలు తవ్వేవారు.

Colombia Earthquake | 224కు చేరిన కొలంబియా భూకంప మృతుల సంఖ్య..నేలమట్టమైన 1600 భవనాలు

ఆ గుంతల్లో బొగ్గు, నకిలీ బంగారు నాణేలను పాతిపెట్టి.. తాము చెప్పిన విధంగా పూజలు చేస్తే బొగ్గు క్రమంగా బంగారంగా మారుతుందని నమ్మించేవారు. ఈ క్రమంలో పూజలు, ఇతర ఖర్చుల పేరుతో బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు.

Gupta Nidhula Mosam | నలుగురు నిందితులు..

ఈ మోసాలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మహ్మద్ మునవ్వర్ (36), సయ్యద్ అలీ అష్రఫ్ (40), మహ్మద్ హాజీ (25), మహ్మద్ సల్మాన్ (29) ఉన్నారు. వీరిలో మహ్మద్ మునవ్వర్ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

Gupta Nidhula Mosam | నకిలీ బంగారు నాణేలు స్వాధీనం

మునవ్వర్ గతంలో కారు మెకానిక్, పెయింటర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. వచ్చిన ఆదాయంతో జీవనం సాగించడం కష్టంగా మారడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడేందుకు పథకం వేసినట్లు వెల్లడించారు.

నిందితుల నుంచి రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రెండు బైక్‌లు, 25 డూప్లికేట్ బంగారు నాణేలు, పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా మోసాలకు గురైన మరికొందరు బాధితులు ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *