అక్షరటుడే, గాంధారి: Gandhari Farmers | విద్యుత్ బోరు కనెక్షన్ కోసం డీడీ చెల్లించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో నాట్లు (Crop Damage) వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గాంధారి( Gandhari) మండలంలోని ముదిల్లి గ్రామంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.
Gandhari Farmers | అధికారుల హామీతో నాట్లు వేసుకున్నారు..
ఈ సందర్భంగా ముదెల్లి గ్రామానికి చెందిన రైతు పరికొండ అశోక్ మాట్లాడుతూ.. తన వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ కోసం నెలరోజుల క్రితం డీడీ చెల్లించానన్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్ రోజుల వ్యవధిలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో తాను నాట్లు సైతం వేసుకున్నానన్నారు. అప్పటినుంచి విద్యుత్‌శాఖ అధికారులు రేపు మాపు అంటూ రోజులు దాటేస్తున్నారని దీంతో వారిపై నమ్మకంతో నాట్లు వేసుకోగా అవి ఎండిపోతున్నాయని రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు.
Gandhari Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా?
ఇప్పటికే పొలంలో నాట్లువేసి సాగు పనులు పూర్తిచేసినప్పటికీ బోరుకు విద్యుత్ లేకపోవడంతో పంటకు నీరు అందడం లేదని రైతు తెలిపారు. రోజురోజుకూ పొలంలోని నాట్లు ఎండిపోతుండటంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీడీ చెల్లించి నెల రోజులు అవుతున్నా సమస్య పరిష్కరించకపోవడంపై రైతు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, పంటను కాపాడాలని కోరారు.
ఇది కూడా చదవండి: Lal Darwaza Bonalu | లాల్‌దర్వాజ బోనాల్లో 116 మంది అనుమానితుల అరెస్ట్