Bike Cash Theft | కేటుగాళ్ల ఘరానా మోసం.. బైక్​ కవర్​లో నుంచి డబ్బు మాయం

బైక్​ కవర్​లో పెట్టిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాల్కొండ: Bike Cash Theft | బైక్​లలో(Bike Cash) నగదు ఉంచి ఏమరపాటుగా ఉంటే కేటుగాళ్లు క్షణాల్లో మాయం చేస్తున్నారు. నగదును వాహనాల్లో ఉంచవద్దని పోలీసులు(Telangana Police) అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు.

Bike Cash Theft | ముప్కాల్​ మండలం జలాల్​పూర్​లో..

పోలీసులు తెలిపిన ప్రకారం.. ముప్కాల్(Mupkal) మండలం జలాల్​పూర్​ గ్రామానికి చెందిన చిందేకర్ గంగాధర్ జూలై 20న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యూనియన్ బ్యాంక్ నుంచి రూ.20 వేల నగదును డ్రా చేశాడు. వాటిని బైక్​ కవర్​లో పెట్టి నవీన్​ మెడికల్​లో మందులు తీసుకునేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా బైక్‌లో ఉంచిన నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: పాకిస్తాన్​పై కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఫైర్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *