అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Prajavani Complaints | జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులను ఆదేశించారు.
Prajavani Complaints | ప్రజలకు దగ్గరయ్యేలా..
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించిన సీపీ వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో మొత్తం 32 ఫిర్యాదులు వచ్చాయి.
దీనిని కూడా చదవండి : Telangana Employee Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై కఠిన ఆంక్షలు.. రూల్స్ బ్రేక్ చేస్తే జీతం కట్


