Rayadurgam Land Auction | రాయదుర్గంలో ఆకాశాన్ని తాకిన ల్యాండ్ రేట్లు.. ఎకరా ఎంతంటే!

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rayadurgam Land Auction | హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.204 కోట్ల మార్కును తాకింది. ఈ వేలం పాటను బట్టి చూస్తే ఐటీ కారిడార్ ప్రాంతంలో ల్యాండ్స్ కోసం కార్పొరేట్ కంపెనీలు ఎంతలా పోటీ పడుతున్నాయో మరోసారి క్లియర్‌గా అర్థమవుతోంది.

land

Rayadurgam Land Auction | 5 ఎకరాల వేలంతో రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం..

తాజా వేలంలో భాగంగా టీజీఐఐసీ రాయదుర్గం పరిధిలోని 5.09 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టగా.. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1,000 కోట్లకు పైగా భారీ ఆదాయం సమకూరింది. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలతో పాటు కమర్షియల్ బిజినెస్ జోన్లు విపరీతంగా విస్తరిస్తుండటమే ఈ రేంజ్ డిమాండ్‌కు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

lannd.2

Rayadurgam Land Auction | రెండు రోజుల్లో రూ.2,500 కోట్లు..

రాయదుర్గంలో భూముల రేట్లు రికార్డులు సృష్టించడం ఇదేం మొదటిసారి కాదు. కేవలం రెండు రోజుల క్రితం జరిగిన వేలంలో అయితే ఎకరా భూమి ధర రూ.237 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు రేటు పలికింది. ఆ ఒక్క వేలం ద్వారానే టీజీఐఐసీకి రూ.1,490 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇలా రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు విడతల వేలం పాటల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తంగా దాదాపు రూ.2,500 కోట్ల భారీ ఆదాయం లభించింది. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, అగ్ర శ్రేణి పెట్టుబడిదారులు పోటీ పడి మరీ వేలంలో పాల్గొనడంతో రాయదుర్గం ల్యాండ్ రేట్లు సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: https://aksharatodaynews.com/indiramma-housewarming-700-homes-entered/

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *