Telangana Formation Day | తెలంగాణ అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Telangana Formation Day | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని (Nizamabad) పోలీస్ పరేడ్ గ్రౌండ్​ను ముస్తాబు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీ.ఆర్.వో గీత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.

వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయకనగర్​లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ముఖ్య అతిథితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులు అర్పిస్తారు. సీపీ సాయి చైతన్య సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.

nizamabad

Telangana Formation Day | కామారెడ్డిలో..

vh

అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కామారెడ్డి (Kamareddy) సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వహించే జెండావిష్కరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వీ.హన్మంత్ రావు (VH) ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రమే కామారెడ్డికి చేరుకున్నారు.

Telangana Formation Day | ఘన స్వాగతం

ఆర్​అండ్​బీ గెస్ట్ హౌస్​లో జిల్లా ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి పుష్పగుచ్ఛం అందజేసి వీహెచ్​కు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 8 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. 8.15 గంటలకు జిల్లా పురోగతిపై హన్మంత్ రావు ప్రసంగిస్తారు. అనంతరం 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 9.30 గంటలకు రెండో విడత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయి.

దీనిని కూడా చదవండి : Indiramma Housewarming | ఒకే రోజు 700 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *