Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు (cheeta force raid) దాడులు చేసింది. ఈ క్రమంలో రెండు జేసీబీ యంత్రాలు, 13 ట్రాక్టర్లను​ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Illegal Gravel Excavation | సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు..

సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచనల మేరకు మొరం అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పక్కా సమాచారం సేకరించారు. అనంతరం సీసీఎస్​ ఏసీపీ ఇన్​ఛార్జి మస్తాన్ అలీ నేతృత్వంలో చీతా ఫోర్స్ సిబ్బంది ధర్పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలోని పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేశారు. అనుమతులు లేకుండా మొరం అక్రమ తవ్వకాలు(illegal mining crackdown) నిర్వహిస్తున్న వాహనాలను గుర్తించారు. అనంతరం 2 జేసీబీ యంత్రాలు, మొరం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

Illegal Gravel Excavation | సహజ వనరులకు నష్టం..

ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడమే కాకుండా, సహజ వనరులు దెబ్బతింటాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా వాగులు, చెరువులు, పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ధర్పల్లి పోలీస్​స్టేషన్(Dharpally Police Station) ఎస్​హెచ్​వోకు అప్పగించారు. సంబంధిత వ్యక్తులపై మైనింగ్, ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన వంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా ఇలాంటి విషయాలపై సమాచారం అందించాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: MMTS Train Cancel | పలు ఎంఎంటీఎస్​ రైళ్ల రద్దు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *