Gutka Dump Seized | చీతా ఫోర్స్​ మెరుపు దాడులు.. భారీగా గుట్కా డంప్​ స్వాధీనం

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Gutka Dump Seized | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిషేధిత గుట్కా(Gutka Seizure), పొగాకు ఉత్పత్తులపై(Tobacco Products) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేకంగా చీతా ఫోర్స్(Cheeta Force) చురుకుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గుట్కా నిల్వలపై ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారంతో దాడులు చేస్తోంది.

Gutka Dump Seized | రూ.30లక్షలకు పైగా గుట్కా డంప్​ స్వాధీనం..

జిల్లాలో(Nizamabad Crime) రూ.30 లక్షలకు పైగా విలువైన గుట్కా డంప్​ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. పక్కా సమాచారం ఆధారంగా చీతా ఫోర్స్​ సిబ్బంది బోధన్​ పోలీస్​స్టేషన్ (Bodhan Police)​ పరిధిలోని ఆచన్​పల్లి గ్రామంలో ఉన్న ఓ షాప్​లో దాచి ఉంచిన డంప్​పై దాడులు చేశారు. ఈ సందర్భంగా హెచ్​కేజీఎన్​ షాప్​లో డంప్​తో పాటు హెచ్​కేజీఎన్​ మటన్​ షాప్​లో దాచిన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా సరకును చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్​ ఎస్​హెచ్​వోకు అప్పగించారు.

Gutka Dump Seized | నిరంతంరంగా దాడులు చేస్తాం..

ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. హానికరమైన గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడులు నిరంతరంగా ఉంటాయని పేర్కొన్నారు. మత్తు పదార్థాల సరఫరాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలువరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: TamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *