అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Road Repairs | కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలో ఎస్డీఆర్ఎఫ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40 లక్షల నిధులను మంజూరు చేసిందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. మంగళవారం సంబంధిత పనులను ఆమె ప్రారంభించారు.
Kamareddy Road Repairs | వరదల్లో దెబ్బతిన్న రోడ్లకు..
ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో వరద వల్ల దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్స్, ఇతర రహదారుల పునరుద్ధరణ పనుల కోసం రూ.32.12 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గతంలో తుఫాను సమయంలో ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్డు పునరుద్ధరణ కోసం రూ.7.88 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. మంజూరైన నిధులతో రోడ్లను త్వరితగతిన పునరుద్ధరిస్తామని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్, అదనపు కలెక్టర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి, కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు సుల్తానా యునుస్, డీఈ హన్మంతరావు, ఏఈ వేణు ప్రసాద్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: RTC Bus Protest | ఆర్టీసీ బస్సులను అడ్డగించిన విద్యార్థులు