తెలంగాణTelangana ICC Committee | రెవెన్యూ శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు 

Telangana ICC Committee | రెవెన్యూ శాఖలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు 

మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్. పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana ICC Committee | మహిళా ఉద్యోగుల రక్షణ, పని ప్రదేశాల్లో వేధింపుల నివారణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలోని రెవెన్యూ శాఖలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ (Internal Complaints Committee – ICC)ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం (మే 4, 2026) జీవో జారీ చేసింది.

Telangana ICC Committee | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు

లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act, 2013), 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలోని అన్ని విభాగాల్లో ఐసీసీలను ఏర్పాటు చేయాలన్న మహిళా, శిశు సంక్షేమ శాఖ అభ్యర్థన మేరకు రెవెన్యూ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana ICC Committee | కమిటీ సభ్యుల వివరాలు

ఈ కమిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా సీనియర్ మహిళా అధికారిని నియమించారు.

  • ఎల్.ఎల్.వి. సుబ్బమ్మ (అడిషనల్ సెక్రటరీ) ప్రిసైడింగ్ ఆఫీసర్
  • జె.వి. విజయలక్ష్మి (జాయింట్ సెక్రటరీ) సభ్యురాలు
  • ఎ. ఉమా రెడ్డి (సెక్షన్ ఆఫీసర్) సభ్యురాలు
  • కె. నివేదిత (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్) టీజీ సచివాలయ మహిళా సంఘం ప్రతినిధి

Telangana ICC Committee | కమిటీ బాధ్యతలు:

  • పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే వేధింపులపై వచ్చే ఫిర్యాదులను ఈ కమిటీ స్వీకరిస్తుంది.
  • ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది.
  • నివేదిక ఆధారంగా నిందితులపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శికి సిఫార్సు చేస్తుంది.

మహిళా ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్. పేరుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Cabinet Decisions | విద్యుత్ కొనుగోలుతోపాటు యాదాద్రి,...

Grain Transport Obstruction | ధాన్యం రవాణాకు ఆటంకం.. 10 మందిపై కేసు నమోదు

అక్షరటుడే, లింగంపేట: Grain Transport Obstruction | కామారెడ్డి జిల్లా లింగంపేట...

Mamata Banerjee setback | భవానీపూర్​లో మమత వెనుకంజ.. నందిగ్రామ్​లో సీఎం అభ్యర్థి సువేందు గెలుపు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee setback | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో...

Traffic staff health | ట్రాఫిక్​ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Traffic staff health | ఎండాకాలంలో ట్రాఫిక్​...