Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Transport | రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లారీలు రాక కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి గిడ్డంగులు, రైస్ మిల్లులకు ధాన్యం సజావుగా తరలించేందుకు లారీలు, ట్రాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రవాణాలో అంతరాయాలను నివారించడానికి నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పని చేయాలని పేర్కొంది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ (Commissioner of Transport) అధికారులను ఆదేశించారు.

Paddy Procurement Transport | అందుబాటులో ఉంచాలి

రైతుల (Farmers) అవసరాలకు అనుగుణంగా వాహనాలు తక్షణమే అందుబాటులో ఉండేలా చూసేందుకు జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాలో పాల్గొనే అన్ని వాహనాలకు ఆర్‌సీ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రవాణా సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రవాణా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *