అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Heavy Rains | వర్షాల కోసం నిత్యం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. నేడు తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. వరినాట్లు వేయడానికి అన్నదాతలు ఆలోచిస్తున్నారు. బోరుబావుల కింద నాట్లు వేసినా.. వాటికి నీరందడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వానాకాలం సీజన్ ప్రారంభం అయ్యాక ఒకసారి కూడా వాగులు పారేట్లు వర్షం పడలేదు.
Telangana Heavy Rains | ఆ జిల్లాల్లో..

ఈ రోజు భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విస్తృతంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇతర జిల్లాలు తేలికపాటి వర్షాలు పడుతాయి. హైదరాబద్ నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తేలికపాటి – మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Kollapur Principal Assault | విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి.. ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థి