అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Iran Airstrikes | హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని 80 సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీనికి ప్రతికారంగా బహ్రెయిన్, కువైట్‌లలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించగా, చమురు కేంద్రాలపై దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేశారు.
US Iran Airstrikes | 80 సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్
హర్ముజ్ జలసంధిపై ఉన్న ఓడరేవు నగరాలైన సిరిక్, బందర్ అబ్బాస్‌తో సహా, దేశంలోని దక్షిణ ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని నిన్న ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ దేశ సైతం వైమానిక దాడులు చేపట్టింది. అమెరికా దాడుల అనంతరం గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ దాడులను నివేదించాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో పేలుళ్లు సంభవించగా, కువైట్ క్షిపణులు మరియు డ్రోన్‌లను అడ్డుకుంది.
US Iran Airstrikes | బెదిరింపులతో కాదు..
బెదిరింపులు, ఇచ్చిన మాట తప్పడం ఇకపై ఉచితం కాదనే విషయాన్ని అమెరికా ఇంకా నేర్చుకోలేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ అన్నారు. మీరు దాడి చేస్తే, మీకు దెబ్బ తగులుతుంది అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ ఒప్పందాల మేరకు మాత్రమే తెరుచుకుంటుంది తప్ప.. అమెరికా బెదిరింపులతో కాదని పేర్కొన్నారు. ఇరాన్ తీరప్రాంతంలోని వాయు రక్షణ వ్యవస్థలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలతో సహా 90 ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్ పై అమెరికా భీకర దాడులు
ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా విరుచుకుపడింది. ఇరాన్‌లోని 80 సైనిక స్థావరాలపై అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్‌లలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి… pic.twitter.com/UmMm8dKcJA
— Akshara Today | Telugu News (@aksharatoday) July 9, 2026
ఇది కూడా చదవండి..: Trump Warns Iran | ఈ రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు.. మరోసారి హెచ్చరించిన ట్రంప్