అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Warns Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా–ఇరాన్ శాంతిచర్చలతో కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతం.. మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.
ఇరాన్ ఇటీవల పలు వాణిజ్య నౌకలపై దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్తతలు మొదలు అయ్యాయి. ఇరాన్ దాడులకు ప్రతిగా అమెరికా టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేసింది. దీంతో ఇరాన్ సైతం ధీటుగానే స్పందించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. అనంతరం కొద్దిగంటలకే ఇరాన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ఈ రాత్రి ఆ దేశంపై “తీవ్రమైన దాడి” చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Trump Warns Iran | నాటో సదస్సులో..
ట్రంప్ టర్కీలోని అంకారాలో జరిగిన నాటో (NATO) సదస్సులో మాట్లాడారు. నిన్న రాత్రి వారిపై చాలా గట్టిగా దాడి చేశాం. ఈ రాత్రి కూడా వారిపై గట్టిగా దాడి చేస్తాం. వారికి ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నాను అని ట్రంప్ అన్నారు. ఇరాన్ ప్రవర్తన “విచిత్రంగా” (పిచ్చిగా) ఉందన్నారు. ఇరాన్ అణు నిరాయుధీకరణ కోసం చర్చలు జరిగాయని, ఇరు పక్షాలు సమావేశాల్లో దీని గురించి చర్చించినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్ ప్రతినిధులు విలేకరుల సమావేశాలకు వెళ్లి అటువంటి చర్చలేవీ జరగలేదని ప్రకటించేవారని పేర్కొన్నారు. 47 ఏళ్లుగా వారు మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం చెలాయిస్తూ వ్యవహరించారన్నారు. కానీ ఇకపై వారు ఆధిపత్యం చెలాయించలేరన్నారు.
Trump Warns Iran | ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం
ఈ రాత్రి జరగబోయే దాడి భారీగా ఉండవచ్చని, అమెరికా “ఖర్గ్ ద్వీపాన్ని” కూడా స్వాధీనం చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం గురించి స్పందిస్తూ, అది కేవలం ఇరాన్‌కు మాత్రమే వర్తిస్తుందని, ఇతర దేశాలు “తమకు కావలసినవి పొందవచ్చని” ఆయన స్పష్టం చేశారు. కాగా ట్రంప్ గతంలో రెండు సార్లు ఇదేవిధంగా ఇరాన్‌ను (Trump Warns Iran) హెచ్చరించారు. భారీ ఎత్తున దాడులు చేస్తామని, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ (Kharg) ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఆ రెండు సమయాల్లో రాత్రికి రాత్రే ట్రంప్ వెనక్కి తగ్గి కాల్పుల విరమణకు ఓకే చెప్పారు. దీంతో మరోసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. పెద్ద ఎత్తున దాడి చేస్తే ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించే అవకాశం ఉండటంతో అగ్రరాజ్యం మరోసారి కాల్పుల విరమణకు మొగ్గు చూపే అవకాశం ఉంది.
ఇరాన్ పై విరుచుకుపడతాం: ట్రంప్
ఇరాన్ పై ఈరోజు రాత్రి మరింత తీవ్రంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. తుర్కియేలో జరుగుతున్న నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడారు. “ నేను ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నా. ఈ రాత్రి వారిపై గట్టిగా విరుచుకుపడబోతున్నాం” అని ఆయన… pic.twitter.com/EOaJWZFJWe
— Akshara Today | Telugu News (@aksharatoday) July 8, 2026
దీనిని కూడా చదవండి : ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్