అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dr. Anil Menon | నాసా nasa వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ సోయుజ్ MS-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) తన తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు.
Dr. Anil Menon | పరిశోధనల లక్ష్యం
డాక్టర్ అనిల్ మీనన్ సోయుజ్ ప్రధానంగా వైద్య, జీవశాస్త్ర, అంతరిక్ష పరిశోధనలపై ప్రయోగాలు చేయనున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే వ్యోమగాముల శరీరంలో వచ్చే మార్పులు, ముఖ్యంగా ఎముకలు, కండరాలు, గుండె, మెదడు పనితీరుపై శూన్య గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాన్ని ఆయన అధ్యయనం చేయనున్నారు.
Dr. Anil Menon | చంద్ర, అంగారక గ్రహాల సుదీర్ఘ మిషన్లకు
ఈ పరిశోధనలు భవిష్యత్తులో చేపట్టబోయే చంద్ర, అంగారక (Mars) గ్రహాల సుదీర్ఘ మిషన్లకు ఎంతో కీలకం కానున్నాయి. అనిల్ మీనన్, రష్యన్ వ్యోమగాముల బృందం అంతరిక్ష కేంద్రంలో సుమారు 8 నెలల పాటు గడపనుంది.
భార్యాభర్తలు ఇద్దరూ…
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అనిల్ తిరిగి భూమికి చేరుకుంటారు. డాక్టర్ అనిల్ మీనన్ భార్య అన్నా విల్హెల్మ్ కూడా 2024లో స్పేస్ ఎక్స్ చేపట్టిన ఒక ప్రైవేట్ మిషన్ ద్వారా 5 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామి. దీంతో అంతరిక్ష యాత్ర చేసిన అరుదైన భార్యాభర్తల జంటలలో వీరు ఒకరిగా నిలిచారు.