Bank Holidays in May | మే లో 9 రోజులు బ్యాంకులు బంద్!

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays in May | బ్యాంకులకు సంబంధించిన సెలవులను జాబితాను ఆర్‌బీఐ (RBI) విడుదల చేస్తుంటుంది. మే నెలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ సెలవులు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. జాతీయ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉన్నా.. కొన్ని స్థానిక పండుగలకు ఆయా రాష్ట్రాల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.

అన్ని రాష్ట్రాలలో ఆదివారాలతోపాటు రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే బ్యాంకులు మూసి ఉన్నా ఖాతాదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ సేవలు (UPI Services) అందుబాటులో ఉంటాయి. కచ్చితంగా బ్యాంకులకు వెళ్లి చేయాల్సిన పనులకోసం ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Bank Holidays in May | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి.

మే-1 మే డే(శుక్రవారం)
మే 3 ఆదివారం
మే 9 రెండో శనివారం
మే 10 ఆదివారం
మే 17 ఆదివారం
మే 23 నాలుగో శనివారం
మే 24 ఆదివారం
మే 27 బక్రీద్ (బుధవారం)
మే 31 ఆదివారం

ఇది కూడా చదవండి..: Rajnath Singh Statement | భారత్ ఐటీ హబ్ అయితే.. పాక్ ఉగ్రవాదానికి హబ్ : రాజ్‌నాథ్ సింగ్

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *