Karnataka Fire Accident | కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం

కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Fire Accident | కర్ణాటక (Karnataka)లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిక్కబళ్లాపూర్ పరిధిలోని మాస్టెనహళ్లి KIADB పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఒక కర్మాగారంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Karnataka Fire Accident | భారీగా ఆస్తినష్టం

పారిశ్రామిక ప్రాంతంలోని గృహోపకరణాల తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: CJP Leaders Arrest | సీజేపీ నేతల అరెస్ట్​పై రాహుల్​ గాంధీ ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *