అక్షరటుడే వెబ్డెస్క్: Indiramma Housing Scheme | తెలంగాణలో ( Telangana )పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY – గ్రామీణ)’ పోర్టల్తో అనుసంధానించే ప్రక్రియను హౌసింగ్ శాఖ ప్రారంభించింది. దీనిద్వారా అర్హులైన పేద లబ్ధిదారులకు కేంద్రం నుంచి భారీగా అదనపు ఆర్థిక సహాయం అందనుంది.
Indiramma Housing Scheme | రెండు విడతల్లో ఎంట్రీ..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణకు 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిధులను సద్వినియోగం చేసుకునేందుకు హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులు ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు.
అలాగే రెండో దశలో మట్టి గుడిసెలు, పాకల్లో నివసిస్తున్న మరో 25 వేల మంది పేదలను గుర్తించి కొత్త లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్రస్థాయి సిబ్బందికి (ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు) యాప్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ డేటా ఎంట్రీ, జియో ట్యాగింగ్ ప్రక్రియ మొత్తాన్ని అక్టోబర్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని హౌసింగ్ శాఖ గట్టి పట్టుదలతో ఉంది.
Indiramma Housing Scheme | రూ. 72 వేల ఆర్థిక సహాయం..
ఈ ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు విడుదల కానున్నాయి. పీఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇళ్లుకు కేంద్రం నుంచి రూ. 72 వేల ఆర్థిక సహాయం లభిస్తుంది. దీనికి తోడు ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణానికి, ఉపాధి హామీ పథకం కింద అదనపు మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ అనుసంధానంతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావడంతో పాటు పేదలకు ఆర్థిక భరోసా దక్కనుంది.
ఇది కూడా చదవండి: CJP Leaders Arrest | సీజేపీ నేతల అరెస్ట్పై రాహుల్ గాంధీ ఆగ్రహం