CJP Leaders Arrest | సీజేపీ నేతల అరెస్ట్​పై రాహుల్​ గాంధీ ఆగ్రహం

సీజేపీ నాయకుల అరెస్ట్​పై లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Leaders Arrest | సీజేపీ నాయకుల అరెస్ట్​పై లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపినందుకు ఆ పార్టీ నాయకులను అరెస్ట్​ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదు. దానికోసం యువతను జైలులో పెట్టడం పిరికిపంద చర్య అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. సీజేపీ, యువత, విద్యార్థులు, ఇండియా కూటమి నిరసనల జెండాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనన్నారు. జంతర్ మంతర్‌ను నిరసన స్థలం జాబితా నుండి తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రజలు దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటారని పేర్కొన్నారు.

CJP Leaders Arrest | అభిజిత్​ దీప్కే ధన్యవాదాలు

సీజేపీ నేతలకు మద్దతు తెలిపినందుకు రాహుల్​ గాంధీ అభిజిత్​ దీప్కే ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా వివిధ వర్గాలు చేస్తున్న నిరసనలపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, ఆ నిరసనలన్నీ ఒక్కటేనని రాహుల్ గాంధీ చెబుతున్నారు. జూలైలో, తాజా నిరసన సమయంలోనూ సీజేపీ నాయకత్వంతో వేదిక పంచుకోవడానికి రాహుల్ గాంధీ దూరంగా ఉండటంపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి..: Air India Bomb Threat | ఎయిర్​ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *