INDIA Alliance Rally Hyderabad | హైదరాబాద్ వేదికగా ‘ఇండియా’ కూటమి భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయిలో బలప్రదర్శనకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: INDIA Alliance Rally Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జాతీయ స్థాయిలో బలప్రదర్శనకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 24వ తేదీన విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి ఆధ్వర్యంలో నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. రాబోయే రాజకీయ సమీకరణాలు, ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా సుమారు లక్ష మంది జనసమీకరణతో ఈ సభను నిర్వహించేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నేతలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. సభా వేదిక ఎంపిక, రవాణా, భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే పీసీసీ ముఖ్య నేతలు, మంత్రులు ప్రత్యేక కమిటీలుగా ఏర్పడి ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.

INDIA Alliance Rally Hyderabad | హాజరుకానున్న అగ్రనేతలు..

ఈ ప్రతిష్టాత్మక బహిరంగ సభకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాగ్రాతో పాటు ఇండియా కూటమిలోని జాతీయ స్థాయి అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తెస్తూ సాగుతున్న పోరాటంలో భాగ్యనగరం సభను అత్యంత కీలక మైలురాయిగా మలచాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ సభ ద్వారా అటు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేలా అగ్రనేతల ప్రసంగాలు ఉండనున్నాయి.

ఇది కూడా చదవండి:  Samakhya 2026 | తెలంగాణలో పెట్టుబడులకు భరోసా : సీఎం రేవంత్​రెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *