అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Orange Alert | హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
Telangana Orange Alert | ఈదురుగాలులు..
మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన IMD, రాత్రి 11:24 గంటల వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
