Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ ఆగ్రహం

సిరిసిల్ల ఎస్పీ మహేష్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీకి బీజేపీ కార్యకర్తలంటే కోపమెందుకని ప్రశ్నించారు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay Anger | సిరిసిల్ల ఎస్పీ మహేష్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనకు ఎస్పీ గైర్హాజరు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

బండి సంజయ్​ శనివారం సిరిసిల్ల (Sircilla)లో పర్యటించారు. సోమవారం నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్న నేపథ్యంలో సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య పాఠశాలలో ‘‘మన బడి – మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బండి సంజయ్​ పాఠశాలలో బెంచీలను కడిగారు.

Bandi Sanjay Anger | బీఆర్​ఎస్​లో చేరమని చెప్పండి

కేంద్ర మంత్రి బండి సంజయ్​ పర్యటన సందర్భంగా స్వాగతం పలకడానికి ఎస్పీ మహేశ్​ (SP Mahesh) హాజరు కాలేదు. బదులుగా వేరే అధికారి వచ్చి ఆయనకు మొక్క అందించారు. దీంతో సంజయ్​ ఎస్పీ తీరుపై ఆయనతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఎస్పీకి బీజేపీ కార్యకర్తలంటే కోపమెందుకు అన్నారు. కేటీఆర్‌పై అంత ప్రేమ ఎందుకన్నారు. బీఆర్ఎస్‌పై అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలోనే చేరమని చెప్పండని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Orange Alert | భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *