Weather Update | తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు పడుతాయని పేర్కన్నారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణ (Telangana)లో ఇటీవల విస్తారంగా వర్షాలు కురిశాయి. రెండు రోజులు వాన కాస్త తెరిపినిచ్చింది. అయితే మళ్లీ మూడు రోజుల పాటు వానలు పడుతాయని చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలోని 18 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా సోమవారం మధ్యాహ్నం – రాత్రి సమయంలో మోస్తరు – భారీ వర్షాలు కురుస్తాయి.

Weather Update | పంటలకు భరోసా

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురిశాయి. ఎల్​నినో ప్రభావంతో జూన్​లో లోటు వర్షపాతం నమోదు అయింది. జూలై 20 వరకు సైతం చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు. దీంతో పంటలు సాగు చేయడానికి రైతులు ఆలోచించారు. బోరు బావుల కింద వేసిన పంటలు సైతం నీరందక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో వాయుగుండం ప్రభావంతో 6 రోజుల పాటు వాన దంచికొట్టింది. దీంతో పంటలకు జీవం వచ్చింది. చెరువులు, జలాశయాల్లోకి నీరు రావడంతో వానాకాలం పంటలకు ఢోకా లేదని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: KTR Rahul Letter | ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల దుమారం.. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఘాటు లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *