అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MGM Hospital | వరంగల్ (Warangal)లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.
ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం పైకప్పు (ఫాల్స్ సీలింగ్) కొంత భాగం కూలిపోయింది. వార్డులో చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులపై అది పడిపోయింది. ఈ ఘటనలో జనగామ జిల్లాకు చెందిన మస్తాన్ (55), అతని అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార (33) అనే ముగ్గురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. దీంతో వారికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రోగులు మరియు వారి కుటుంబ సభ్యులలో ఆందోళన కలిగించింది.
MGM Hospital | పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పిస్తున్నామని, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలు కావడం లేదు. సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వైద్యులు లేరు. మరికొన్ని చోట్ల ఉన్నా రావడం లేదు. మరోవైపు శిథిలావస్థకు చేరిన భవనాల్లో కొనసాగుతున్న ఆస్పత్రులు సైతం ఉన్నాయి. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
దయనీయ పరిస్థితుల్లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి
ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడి మీద పడడంతో గాయాలపాలైన ముగ్గురు వ్యక్తులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ జిల్లాకు చెందిన మస్తాన్ (55), అతని అటెండర్లు ఎల్లమ్మ (50), ఓంకార (33) అనే ముగ్గురు వ్యక్తులకు గాయాలు pic.twitter.com/XbPEXJMwqy
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2026
దీనిని కూడా చదవండి : Harish Rao | అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం : హరీశ్‌రావు