అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Conditions | పశ్చిమాసియలో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. సౌదీ (Saudi)పై యెమెన్‌లోని హౌతీలు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాకు ఇరాన్ షరతులు పెట్టింది.
మధ్యప్రాచ్యంలోని యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, అమెరికాకు ఏడు షరతులు విధించింది. యుద్ధాన్ని ముగించడానికి టెహ్రాన్ తన షరతులను తెలియజేసిందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. తమ సందేశం స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్ దీని నుంచి బయటపడాలంటే ఇరాన్ హక్కులు, షరతులను అంగీకరించడం తప్ప దానికి మరో మార్గం లేదన్నారు.
Iran Conditions | ఆస్తులను విడుదల చేయాలి
అన్ని రంగాలలో యుద్ధాన్ని ముగించాలని, ఇరాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయాలని, ఓడరేవులపై అమెరికా నావికా దిగ్బంధనాన్ని ముగించాలని షరతుల్లో పేర్కొన్నారు. యెమెన్, సౌదీ అరేబియాల మధ్య జరుగుతున్న పోరాటం ముగియాలని ఇరాన్ కోరుకుంటోందని ఆయన అన్నారు. తమ షరతులను అమెరికాకు తెలిపిన మధ్యవర్తి ఖతార్‌తో తాము చర్చలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ షరతులను అంగీకరించడం అగ్రరాజ్యం ప్రయోజనాలకు మంచిదని ఆయన అన్నారు. ట్రంప్ బెదిరింపులు ఎలాంటి ఫలితాలను సాధించలేవని స్పష్టం చేశారు.
దీనిని కూడా చదవండి : Harish Rao | అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం : హరీశ్‌రావు