అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | తమపై అక్రమ కేసులు పెట్టే వారిని వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా మోటాకొండూరులో ఆయన ఆదివారం మాట్లాడారు.
22A పోరాడుతున్నందుకే తమను టార్గెట్ చేశారని హరీశ్‌రావు అన్నారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అక్రమ కేసులు పెట్టినవారిని వదిలేది లేదన్నారు. అక్రమ కేసులు పెట్టిన వాళ్ల పేర్లు అన్నీ రాసిపెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ధైర్యంగా పోరాటం చేయాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Harish Rao | కరెంట్ కోతలు
రాష్ట్రంలో సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 8 గంటలు కూడా సరిగా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. లో వోల్టేజీ వస్తుండటంతో మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. కరెంట్ లేక పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నా.. సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. రైతు బీమా పథకాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు.
ప్రశ్నిస్తుండటంతోనే రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. కేసులు పెట్టినా, వేధించిన తాము భయపడమన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారన్నారు.
అక్రమ కేసులు పెట్టిన వాళ్ల పేర్లు అన్నీ రాసిపెట్టుకోండి
మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే, వాళ్లని వదిలే ప్రసక్తే లేదు
ధైర్యంగా పోరాటం చేయండి, మీకు మేము అండగా ఉంటాము
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/KmG64pLBhN
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) September 20, 2026
దీనిని కూడా చదవండి : India Women Final | బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు