అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Women Final | ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు (India Women Final) ఘన విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్లో భాగంగా బంగ్లాతో తలపడిన భారత్ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
జపాన్ (Japan)లోని కరొగి స్పోర్ట్స్ పార్కులో జరగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆది నుంచి భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ చెలరేగిపోయారు. మందాన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా.. 49 బంతుల్లో అజేయంగా 100 రన్స్ చేసింది. ఇందులో 3 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగుల చేసింది. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.
India Women Final | భారత బౌలర్ల విజృంభణ
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వరుసగా వికెట్లు తీశారు. దీంతో ఆది నుంచి ఆ జట్టు కష్టాల్లో పడింది. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన జట్టు ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ నందిని శర్మ, దీప్తి శర్మ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. 114 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై శ్రీలంక విజయం సాధించి, పైనల్‌కు చేరింది. దీంతో ఫైనల్లో భారత్ శ్రీలంకతో తలపడనుంది.
Emotional Shafali Verma after creating history in Asian Games 🥹❤️ pic.twitter.com/5bpp7i6cnc
— Johns. (@CricCrazyJohns) September 20, 2026
దీనిని కూడా చదవండి : Asian Games | ఆసియా క్రీడలు.. షూటింగ్లో భారత్‌కు రెండు రజతాలు