క్రీడలుIPL 2026 Final | ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మధ్య...

IPL 2026 Final | ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం.. ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ సమరం,వ‌ర్షం ప‌డితే..?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ జరగనుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: IPL 2026 Final | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్ తుది అంకానికి చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ పోరు నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.

ఇరు జట్లు తమ రెండో ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది ఇదే వేదికపై పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఎన్నో ఏళ్ల టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ, ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఫైనల్‌కు చేరుకుంది. మరోసారి ట్రోఫీని అందుకుని తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. జట్టు మొత్తం ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు ఒత్తిడిని అధిగమిస్తూ విజయాలను అందుకోవడం ఆర్సీబీకి పెద్ద బలంగా మారింది.

IPL 2026 Final | వ‌ర్షం ప‌డితే ప‌రిస్థితి ఏంటి?

IPL 2026 Final

మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఐదేళ్లలో మూడోసారి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. 2022లో అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్, 2023లో ఫైనల్‌కు చేరినా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చేతిలో ఓటమి చవిచూసింది. ఈసారి ఆ చేదు జ్ఞాపకాలను మరిపిస్తూ మరోసారి ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న జట్టు కావడంతో గుజరాత్ (Gujarat Titans) కూడా టైటిల్‌కు గట్టి పోటీదారుగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు వాతావరణ పరిస్థితులపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే అహ్మదాబాద్‌లో ఆదివారం వర్షం పడే అవకాశం కేవలం 5 శాతం మాత్రమే ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడితే బీసీసీఐ జూన్ 1ను రిజర్వ్ డేగా కేటాయించింది. ఆదివారం ఆట ఎక్కడ ఆగిపోతే, సోమవారం అక్కడి నుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది.

IPL 2026 Final | ఆర్సీబీకి టైటిల్ దక్కే అవకాశం

అయితే ఆదివారం, సోమవారం రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం ఆర్సీబీకి టైటిల్ దక్కే అవకాశం ఉంటుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ GT ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ పూర్తి కావాలని కోరుకుంటోంది. ఫైనల్‌కు చేరుకున్న విధానం కూడా ఇరు జట్ల బలాన్ని చాటిచెప్పింది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆ ఓటమి తర్వాత కూడా గుజరాత్ వెనుకడుగు వేయకుండా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తుది పోరుకు చేరుకుంది.

IPL 2026 Final

IPL 2026 Final | రజత్ పటీదార్ కు అరుదైన ఘనత

ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే కెప్టెన్ రజత్ పటీదార్ అరుదైన ఘనతను అందుకుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ప్రత్యేక రికార్డు కూడా ఫైనల్ మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి..: Vaibhav Suryavanshi Emotional | క్వాలిఫయర్-2 ఓటమితో కన్నీటి పర్యంతమైన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైర‌ల్‌

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...

Water Wastage Fine | నీటి వృథాపై జలమండలి చర్యలు.. రూ.10 వేల జరిమానా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Wastage Fine | ప్రస్తుతం ఎండలు...

Gujarat Bus Accident | గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat Bus Accident | గుజరాత్​లో ఘోర...