Toyota Urban Cruiser EV | సింగిల్ చార్జ్‌తో 543 కి.మీ. రేంజ్!.. ఈవీ కారును లాంచ్ చేసిన టయోటా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toyota Urban Cruiser EV | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్.. భారత దేశంలో తొలి విద్యుత్ కారును లాంచ్ చేసింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పేరుతో తీసుకువచ్చిన ఈ కారు.. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, ఎంజీ జెడ్ ఎస్, మారుతీ సుజుకీ ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)కు పోటీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.23.60 లక్షలు. ఈ కారు ఫీచర్లు ఇలా ఉన్నాయి.

Toyota Urban Cruiser EV | డిజైన్..

కారు పొడవు 4,285 ఎంఎం, వెడల్పు 1,800 ఎంఎం, ఎత్తు 1,640 ఎంఎం, అద్భుతమైన క్యాబిన్ స్పేస్ కోసం 2700 ఎంఎం భారీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

ముందుభాగంలో టయోటా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉపయోగించే స్టైలిష్ డిజైన్ కనిపిస్తుంది. బోనెట్, సైడ్ ప్రొఫైల్ ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యారెక్టర్ లైన్లు, ఏరోడైనమిక్ డిజైన్ గల 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు.

క్యాబిన్ లోపల 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్ట్లర్, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 12 కలర్ ఆప్షన్లతో కూడిన యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లయిమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్ ఇచ్చారు.

Toyota Urban Cruiser EV | భద్రత ఫీచర్లు..

Toyota Urban Cruiser EV

ప్రయాణికుల భద్రతకు టయోటా అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు. ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 అడాస్ ఫీచర్లున్నాయి.

కలర్ ఆప్షన్లు : ఇది బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, స్పోర్టిన్ రెడ్ వంటి ఆకర్షణీయమైన సింగిల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. అలాగే బ్లాక్ రూఫ్‌తో కూడిన కేఫ్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ డ్యుయల్‌టోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.

బ్యాటరీ వేరియంట్లు : రెండు రకాల LFP బ్యాటరీ(49 కిలోవాట్, 61 కిలోవాట్ ) ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఏసీ, డీసీ ఫాస్ట్ చార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.49 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 106 హెచ్పీ పవర్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు సరిపోతుంది.61 కిలోవాట్ బ్యాటరీ మోడల్ వేరియంట్ 171 బీహెచ్‌పీ శక్తిని, 189 న్యూటన్ మీటర్ (ఎన్ఎం) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్ చార్జ్‌తో 543 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Toyota Urban Cruiser EV

ఇది కూడా చదవండి..: May 31 Gold Rates | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *