అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 23 Market Analysis | అధిక ముడి చమురు ధర (Crude oil) లతోపాటు మెటా ప్లాట్‌ఫామ్స్, టెస్లా కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం, పెరుగుతున్న ఏఐ సంబంధిత వ్యయంపై ఆందోళనలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
దీంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్ భారీ నష్టాలను చవిచూసింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఆసియా సూచీలు సైతం నష్టాల్లో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) లాభాలతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 23 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్ 2.60 శాతం, ఎస్ అండ్ పీ 1.21 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.30 శాతం నష్టంతో ఉంది.
Oct 23 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.08 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.41 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.26 శాతం నష్టపోయాయి.
Oct 23 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.08 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.49 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.99 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.90 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.67 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. తైవాన్ మార్కెట్‌కు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.48 శాతం లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభం కానున్నాయి.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 3,458 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,891 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 35 పైసలు బలహీనపడి 94.82 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 114.20 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.66 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.78 నుంచి 0.88 కి పెరిగింది.
- విక్స్ 15.76 వద్ద ఉంది.