కాలం మారుతోంది.. దీంతో వార్తను తెలుసుకునే విధానం కూడా మారింది.. సూటిగా, స్పష్టంగా, సింపుల్ గా తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికి అలవాటైపోయింది. ఈ క్రమంలోనే సమాచార ప్రసార మాధ్యమాల రూపురేఖలు మారుతున్నాయి. డిజిటల్ మీడియా కొత్తం పుంతలు తొక్కుతోంది. అయితే ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, పాలకులను ప్రశ్నించడం, సమాజానికి వాస్తవాలను చేరవేయడంలో జర్నలిజం మూలసూత్రాలు మాత్రం ఎప్పటికీ మారవు. ఈ విలువలను తన ప్రయాణానికి పునాదిగా చేసుకుని తెలుగు డిజిటల్ జర్నలిజంలో తనదైన ముద్ర వేస్తున్న వార్తా వేదిక అక్షరటుడే డిజిటల్.
2023 సెప్టెంబరు 3న ప్రారంభమైన అక్షరటుడే (Akshara Today).. అనతికాలంలోనే తెలుగు పాఠకులకు చేరువైంది. నిజామాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు విట్టం విజయ్ సారథ్యంలో ప్రారంభమైన ఈ వెబ్ న్యూస్ పోర్టల్.. గడిచిన మూడేళ్లలో వేలాది వార్తలను పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. లక్షలాది మంది పాఠకులను సొంతం చేసుకుంది.
ప్రజా సమస్యలే కేంద్రబిందువు
వార్తను అందించడమే కాకుండా.. ప్రజా సమస్యలకు గొంతుకగా నిలవడం అక్షరటుడే (Akshara Today) ప్రత్యేకత. స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తోంది. “సమస్యను చూపడమే కాదు.. పరిష్కార మార్గాన్ని వెతకాలి” అనే దృక్పథంతో ప్రజల సమస్యలకు తనదైన రీతిలో వేదికగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, పాలనా తీరుతెన్నులు, సామాజిక అంశాలను పాఠకుల ముందుకు తీసుకువస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తోంది.
లోకల్ నుంచి గ్లోబల్ వరకు..
అక్షరటుడే వార్తల పరిధి కేవలం స్థానిక అంశాలకే పరిమితం కాలేదు. తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పరిణామాలను పాఠకులకు అందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలనూ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తోంది. రాజకీయాలు, వాణిజ్యం, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, కొండచరియలు విరిగిపడడం, వరదలు, తుపాన్లు వంటి విపత్తుల నుంచి.. వినోదం, భక్తి, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, జాతకం, బిజినెస్, టెక్నాలజీ, విద్య, ఉద్యోగ సమాచారం వరకు విభిన్న అంశాలను పాఠకులకు అందిస్తోంది. ఒకే వేదికపై.. అనేక ప్రపంచాల సమాచారం అందించేలా కంటెంట్ పరిధిని విస్తరించింది.
తెలుగు నేల దాటి.. ప్రపంచవ్యాప్తంగా పాఠకులు
అక్షరటుడేకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూరప్, గల్ఫ్ దేశాలు తదితర ప్రాంతాల్లోనూ పాఠకులు, వీక్షకులు ఉండడం డిజిటల్ జర్నలిజంలో దాని విస్తృతికి నిదర్శనంగా నిలుస్తోంది. సొంత ప్రాంతానికి దూరంగా ఉన్నా.. స్వస్థల వార్తలను తెలుసుకోవాలనుకునే తెలుగు ప్రజలకు డిజిటల్ వేదికగా అక్షరటుడే (Akshara Today) చేరువైంది.
వెబ్ న్యూస్ నుంచి డిజిటల్ మీడియా వరకు..
మారుతున్న వీక్షకుల ధోరణులను గుర్తించిన అక్షరటుడే (Akshara Today).. తన ప్రయాణాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది. 2026 ఆగస్టు 15న అక్షరటుడే డిజిటల్ మీడియాను ప్రారంభించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్ – హైటెక్ సిటీ కేంద్రంగా డిజిటల్ మీడియా కార్యకలాపాలను విస్తరించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమ వేదికల ద్వారా సమకాలీన సమాచారాన్ని వేగంగా ప్రజల ముందుకు తీసుకువస్తోంది. వార్త చదివే పాఠకుడి నుంచి.. వీడియో చూసే వీక్షకుడి వరకు.. సోషల్ మీడియాలో సమాచారాన్ని అనుసరించే కొత్త తరం వరకు చేరువ కావడమే లక్ష్యంగా డిజిటల్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అంతేకాకుండా ప్రింట్ మీడియాను కూడా కలిగి ఉంది. దీనికి పబ్లిషర్‌గా కౌచిక అలేఖ్య కాగా.. ఎడిటర్‌గా విట్టం విజయ్ కొనసాగుతున్నారు. RNI NUMBERS TELTEL/2015/62326, TELTEL/2015/64160, 132977 APTEL/2015/60422 తో నిజామాబాద, నల్గొండ, రంగారెడ్డి, మంత్లీ ఎడిషన్లు కలిగి ఉంది.
మూడు సంవత్సరాల ప్రస్థానం.. మరింత బాధ్యతతో ముందడుగు
2023 సెప్టెంబరు 3న ఒక ఆలోచనగా మొదలైన అక్షరటుడే (Akshara Today).. మూడేళ్ల ప్రయాణంలో ఒక వార్తా వేదికగా ఎదిగింది. వేలాది వార్తలతో లక్షలాదిపాఠకులకు చేరువైంది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. పాలనను ప్రశ్నిస్తూ.. సమాజానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు వెబ్ న్యూస్ పరిధిని దాటి డిజిటల్ మీడియా ప్రపంచంలోకి అడుగుపెట్టిన అక్షరటుడే ముందు మరింత విస్తృతమైన ప్రయాణం ఉంది. సెప్టెంబరు 3న వార్షికోత్సవ వేళ.. ఇప్పటివరకు అందించిన ఆదరణకు పాఠకులు, వీక్షకులు, శ్రేయోభిలాషులకు అక్షరటుడే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
అలేఖ్య కౌచిక (KOUCHIKA ALEKHYA) – ఫౌండర్ అండ్ సీఈవో
నిజామాబాద్ జిల్లాకు చెందిన అలేఖ్య కౌచిక మీడియా రంగంలో ప్యాషన్ తో అక్షరటుడే డిజిటల్ మీడియాను ప్రారంభించారు. బీటెక్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం పత్రికా రంగంలో రాణించాలనే కలతో సంస్థను ఏర్పాటు చేశారు. అక్షరటుడే (Akshara Today) వ్యవస్థాపకురాలైన అలేఖ్య సీఈవోగా కొనసాగుతున్నారు. తన జీవిత భాగస్వామి, ఈనాడు సీనియర్ జర్నలిస్ట్ విట్టం విజయ్ ఆశయానికి పునాదులు వేయడంలో అనునిత్యం తన వెన్నంటి ముందుకు నడిపిస్తున్నారు. తన టీం విజయవంతంగా ముందుకు నడపడంలో ఎంతో చొరవ తీసుకుంటారు. మీడియారంగంపై తనకున్న దూరదృష్టితో మరింత విస్తరించేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
విట్టం విజయ్ (VITTAM VIJAY) – కో ఫౌండర్ అండ్ ఎండీ
అక్షరటుడే (Akshara Today) వెనుక ఉన్న జర్నలిస్టు విజయ్‌కు జర్నలిజంలో 16 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. అందులో 13 సంవత్సరాలు ఈనాడు సంస్థలో పనిచేశారు. వార్తను చూసే దృష్టి, వాస్తవాలను పరిశీలించే నైపుణ్యం, ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకునే అనుభవం ఆయన జర్నలిజం ప్రయాణంలో భాగమయ్యాయి. ఆ అనుభవాన్నే నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా మలచి.. సొంత వేదికగా అక్షరటుడేను తీర్చిదిద్దారు. తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో హైదరాబాద్ వేదికగా అక్షర టుడే డిజిటల్ కు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 2026లో ఇక్కడ డిజిటల్ మీడియా ఆఫీసు ఏర్పాటులో విజయ్ కృషి ఎనలేనిది. పాడ్ కాస్ట్, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడంలో ఆయన ప్రధాన సమన్వయకర్తగా ఉన్నారు.
అక్షరటుడే వెనుక అక్షరయోధులు
ఒక వార్త పాఠకుడి మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ముందు.. దాని వెనుక ఎన్నో గంటల శ్రమ ఉంటుంది. సమాచారం సేకరణ నుంచి వాస్తవ నిర్ధారణ వరకు.. పదాల కూర్పు నుంచి శీర్షిక ఎంపిక వరకు.. ప్రతి దశలోనూ జర్నలిస్టుల అనుభవం, పరిశీలన, బాధ్యత పనిచేస్తాయి.
అక్షరటుడే (Akshara Today) వెనుక కూడా అలాంటి అనుభవజ్ఞులైన జర్నలిస్టుల బృందమే ఉంది. వివిధ దినపత్రికల్లో దశాబ్దాల అనుభవాన్ని గడించిన వీరు.. తమ వృత్తి నైపుణ్యాన్ని డిజిటల్ జర్నలిజానికి జోడిస్తూ అక్షరటుడేకు బలమైన సంపాదకీయ పునాదిగా నిలుస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాణం.. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే — వాస్తవాన్ని వాస్తవంగా పాఠకుడి ముందుంచడం..
కుమ్మరి శ్రీశైలం (KUMMARI SRISHAILAM) – ఎడిటర్
జర్నలిజంలో రెండు దశాబ్ధాలకు పైగా విస్తృత అనుభవం ఉంది. పత్రిక, టీవీ, డిజిటల్ మీడియాల్లో వివిధ హోదాలో సేవలు అందించారు. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి MCJ, MA సోషియాలజీ, ఉస్మానియా వర్శిటీ పరిధిలోని పీఎంఆర్ లా కాలేజ్ లో LLB పూర్తి చేశారు. 2006లో ప్రజాశక్తి తెలుగు దినపత్రిక ద్వారా జర్నలిజం బాధ్యతల్లో ప్రవేశించారు. 2008 నుంచి ఈనాడులో, 2009 నుంచి సాక్షి దినపత్రికల్లో మెదక్ జిల్లా గజ్వేల్లో పని చేశారు. 2010 నుంచి రెండేళ్ల పాటు HMTV న్యూస్ ఛానల్లో సబ్ ఎడిటర్ గా పని చేశారు. 2012లో ఈనాడు జర్నలిజం స్కూల్లో టీవీ డిప్లొమాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని.. ఈటీవీ న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2013 నుంచి 2016 వరకు ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా, 2024 వరకు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలను బయటకు తీసుకొచ్చి.. వాటి పరిష్కారం కోసం పని చేశారు. మానవీయ, పరిశోధనాత్మక కథనాలపై ఎక్కువ దృష్టి పెట్టి.. చాలా ఇష్యూస్ ను వెలికి తీసేవారు. 2026 వరకు V6 హైదరాబాద్ బ్యూరో రిపోర్టర్ గా రెండేళ్ల పాటు పని చేశారు. హెల్త్, సివిల్ సప్లయ్స్, ఇరిగేషన్, కమ్యూనిస్టు పార్టీల బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అక్షర టుడే (Akshara Today) డిజిటల్ మీడియాతో అసోసియేట్ అయ్యారు.
బల్ల సందీప్‌కుమార్ (BALLA SANDEEP KUMAR) — అసోసియేట్ ఎడిటర్
తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ మీడియా వరకు సుదీర్ఘ ప్రస్థానం ఈయన సొంతం. వార్తను కేవలం రాయడమే కాదు.. దాని వెనుక ఉన్న అంశాన్ని పట్టుకుని, పాఠకుడికి సూటిగా అర్థమయ్యేలా మలచడంలో బల్ల సందీప్‌కుమార్‌ది ప్రత్యేకమైన శైలి. 2007 డిసెంబరులో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్ ఆర్టిస్ట్‌గా మీడియా ప్రస్థానం ప్రారంభించారు. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’లో 2011లో చేరి రెండేళ్లు పనిచేశారు. 2013 నుంచి 2024 జులై వరకు ‘సాక్షి’లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. వార్తా సంపాదకత్వంలో సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించుకున్న ఆయన.. 2024 ఆగస్టు నుంచి అక్షరటుడేలో (Akshara Today) అసోసియేట్ ఎడిటర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజకీయాలు, లోకల్, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రైమ్, లైఫ్‌స్టైల్, సినిమా వంటి విభిన్న అంశాలపై ఆయన కలం కదులుతోంది. వార్తలో సారాన్ని పట్టుకోవడం.. పదాల్లో పదును చూపించడం.. ఇదే సందీప్‌కుమార్ సంపాదకీయ శైలి.
నరేష్ చందన్ (NARESH CHANDAN) — సీనియర్ న్యూస్ ఎడిటర్
నిజామాబాద్‌కు చెందిన నరేష్ చందన్‌కు ప్రింట్, డిజిటల్ మీడియా రంగాల్లో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. వార్తా రంగంలో విభిన్న దశలను దాటుకుంటూ.. ఎడిటోరియల్ డెస్క్‌లో తనదైన ముద్ర వేసుకున్న జర్నలిస్టు. వార్త వెనుక ఉన్న కథను ఒడిసిపట్టే చూపు ఈయన సొంతం. 2008లో ఈనాడు ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2015లో ‘మనం’ పత్రికలో స్టాఫర్‌గా, 2016లో ‘మన తెలంగాణ’లో బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్‌ఎడిటర్‌గా మరో కీలక దశను ప్రారంభించారు. 2023 నుంచి అక్షరటుడే (Akshara Today) సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. రాజకీయాలు, విద్య, క్రైమ్, ట్రెండింగ్ అంశాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ, లైఫ్‌స్టైల్ కథనాలను పాఠకుల ముందుకు తీసుకువస్తున్నారు. వార్తలోని కీలక అంశాన్ని గుర్తించి.. దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలో ఆయన అనుభవం సంపాదకీయ బృందానికి బలంగా నిలుస్తోంది. వార్తను వెంబడించడం మాత్రమే కాదు.. వార్త వెనుక ఉన్న అసలు కథను వెలికితీయడమే నరేష్ చందన్ జర్నలిజం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
మల్లవరపు పవిత్ర (MALLAVARAPU PAVITHRA) — సీనియర్ యాంకర్..
గుంటూరుకు చెందిన పవిత్ర.. యాంకర్ గా ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. తన గొంతుతో వార్తకు జీవం పోస్తుంది. సంఘటనలు, విశ్లేషణలే కాదు.. సంక్లిష్ట విషయాలను కూడా సరళమైన, స్పష్టమైన భాషలో సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా, ఆలోచింపజేసే విధంగా ప్రెసెంట్ చేస్తుంది. 2020 – 2022లో ఎంసీజే పూర్తి చేశారు. చదువు కొనసాగిస్తూనే 2021 జూలై ఈటీవీ ఛానల్లో చేరారు. అనతికాలంలోనే ఈటీవీలో అత్యంత ముఖ్యమైన ఉదయం 7AM, 9PM బులెటెన్లు న్యూస్ ప్రెసెంట్ చేశారు. ప్రస్తుతం అక్షరటుడే (Akshara Today) డిజిటల్ మీడియాలో సీనియర్ యాంకర్ గా కొనసాగుతున్నారు.
ఇమంది ఇందుమతి (EMANDI INDUMATHI) — యాంకర్
విశాఖకు చెందిన ఇందుమతి.. ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇన్ఫోసిస్ లో టెకీగా కొనసాగుతూ.. జర్నలిజంపై ఉన్న ఫ్యాషన్ తో అక్షర టుడే డిజిటల్ మీడియాలో భాగస్వాములయ్యారు. ఇందు తన స్వరం, చురుకుదనంతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారారు. అలాగే.. ఫ్రీలాన్సర్ యాంకర్ గానూ పనిచేశారు. న్యూస్ ప్రెసెంటేషన్లో తన వాయిస్ తో వీక్షకుల అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకుంటుంది. ప్రస్తుతం అక్షరటుడే (Akshara Today)లో యాంకర్ గా తన ప్రతిభను చాటుకుంటోంది.
శశికిరణ్ మొట్టల (SHASHI KIRAN MOTTALA) — చీఫ్ సబ్‌ఎడిటర్
శశికిరణ్ మొట్టలకు తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్ రిపోర్టింగ్ నుంచి సబ్‌ఎడిటింగ్ వరకు.. జర్నలిజంలోని విభిన్న విభాగాల్లో పనిచేసిన అనుభవజ్ఞుడు శశికిరణ్. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్ రిపోర్టర్‌గా మీడియా ప్రయాణం ప్రారంభించారు. అనంతరం రెండేళ్ల పాటు సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. 2010లో సాక్షి జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందిన అనంతరం సాక్షి దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా చేరి.. తన ప్రతిభతో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా ఎదిగారు. 2024 నవంబర్ నుంచి అక్షరటుడే (Akshara Today)లో చీఫ్ సబ్‌ఎడిటర్‌గా సంపాదకీయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలు, స్థానిక అంశాలు, జనరల్ న్యూస్, క్రైమ్, వైరల్ స్టోరీలు ఆయన కలానికి ప్రధాన అంశాలు. ఎన్నో వార్తలను చూసిన అనుభవం.. ఏ వార్తకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో చెప్పే సంపాదకీయ దృష్టి.. శశికిరణ్ మొట్టాల బలం.
శ్రీనివాస్ కొల్లూరి (KOLLOURI SRINIVAS) — అసిస్టెంట్ చీఫ్ సబ్‌ఎడిటర్
శ్రీనివాస్ కొల్లూరికి తెలుగు జర్నలిజంలో 9 ఏళ్ల అనుభవం ఉంది. జర్నలిజం పాఠశాల నుంచి ప్రొఫెషనల్ న్యూస్ డెస్క్ వరకు సాగిన ప్రస్థానం ఎంతో ప్రత్యేకమైంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్‌లో చేరి జర్నలిజం మెళకువలను అభ్యసించారు. అనంతరం సాక్షి దినపత్రికలో కరీంనగర్, నిజామాబాద్ డెస్క్‌లలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. వార్తను వేగంగా గ్రహించి.. దాన్ని పాఠకుడికి సరళంగా, స్పష్టంగా అందించడంలో డెస్క్ అనుభవం ఆయనకు ప్రత్యేక బలంగా మారింది. 2025 ఫిబ్రవరి నుంచి అక్షరటుడే (Akshara Today)లో అసిస్టెంట్ చీఫ్ సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడలు, క్రైమ్ వంటి విభిన్న అంశాలపై కథనాలను అందిస్తున్నారు. వేగానికి వాస్తవాన్ని జోడించి.. వార్తకు అవసరమైన పదును అందించే డెస్క్ యోధుడు శ్రీనివాస్ కొల్లూరి.
శివం నాగరాణి (SHIVAM NAGARANI) — డిజిటల్ కంటెంట్ జర్నలిస్ట్
కొత్త తరం పాఠకుడి ఆసక్తిని అర్థం చేసుకుని.. అవసరమైన సమాచారాన్ని అందించే కలం శివం నాగరాణి సొంతం. తెలుగు వార్తా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉంది. కందిలి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన శివం నాగరాణి.. ప్రస్తుతం అక్షరటుడే (Akshara Today) డిజిటల్ వేదికలో విభిన్న అంశాలపై కథనాలను అందిస్తున్నారు. మారుతున్న డిజిటల్ పాఠకుడి అభిరుచులకు అనుగుణంగా.. ఉపయోగకరమైన సమాచారాన్ని సరళమైన భాషలో అందించడంపై దృష్టి సారిస్తున్నారు. లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ వంటి అంశాలపై కథనాలు అందిస్తున్నారు. పాఠకుడికి ఏ సమాచారం అవసరం? దాన్ని ఎలా సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి? అనే దృష్టితో డిజిటల్ జర్నలిజంలో తనదైన పాత్ర పోషిస్తున్నారు.
చొప్పర శ్రీనివాస్ (SRINIVAS CHOPPARA) – సీనియర్ వీడియో గ్రాఫర్
చొప్పర శ్రీనివాస్ మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యార్థి దశలోనే ఫోటోగ్రఫీపై ఉన్న అభిలాషతో 2006లో మెళకువలు నేర్చుకున్నారు. 2009లో ‘ABN ఆంధ్రజ్యోతి’ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే అసిస్టెంట్ కెమెరామెన్ స్థాయి నుంచి ప్రధాన కెమెరామెన్‌గా తన ప్రతిభతో వేగంగా ఎదిగారు. 2010లో ‘T News’ ఛానల్‌లో ప్రోగ్రామింగ్ కెమెరామెన్‌గా చేరి, తెలంగాణ మలిదశ ఉద్యమంలో వీడియో జర్నలిస్టుగా కీలక పాత్ర పోషించారు. తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితుల్లోనూ విధి నిర్వహణకు మొదటి ప్రాధాన్యతనిచ్చిన నిబద్ధత గల జర్నలిస్టుగా నిలిచారు. 2013లో ‘జీ 24 గంటలు’ ఛానల్‌లో కెమెరామెన్‌గా బాధ్యతలు చేపట్టారు. తర్వాతి కాలంలో ‘Raj News’లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో ఆకట్టుకున్నారు. 2018లో ‘V6 News’ ఛానల్‌లో జాయిన్ అయ్యారు. V6 న్యూస్ ఛానల్‌కే కాకుండా V6 డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా అనేక కవర్ స్టోరీలు, స్పెషల్ ప్రోగ్రామ్‌లు కవర్ చేస్తూ తన సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ‘అక్షరటుడే’లో భాగస్వాములయ్యారు.
బల్ల రాకేశ్ (BALLA RAKESH) – చీఫ్ ఆర్టిస్ట్
బల్ల రాకేశ్ అక్షరటుడే సంస్థ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. ప్రముఖ దినపత్రికల్లో పనిచేసిన అనుభవం ఉంది. సాక్షిలో రెండు సంవత్సరాల పాటు డిజైనర్‌గా పనిచేశారు. అలాగే ఈనాడు సంస్థలో 8 ఏళ్ల పాటు డిజైనర్‌గా వర్క్ చేశారు. అనంతరం అక్షరటుడేతో అసోసియేట్ అయ్యారు.
వీరితో పాటు డెస్క్ సిబ్బంది, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో గ్రాఫర్లు, విలేకరులతో ఇతర సిబ్బంది అక్షరటుడే డిజిటల్ మీడియా ప్రయాణంలో తమదైన ముద్ర వేసుకున్నారు. తమ అనుభవం, నైపుణ్యంతో సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఈ క్రింది లింక్‌లు అక్షరటుడే సోషల్ మీడియా ప్రొఫైల్‌లు
Instragram : https://www.instagram.com/aksharatodaytelugu?stkn=ZmMzb2lpZDNnY2h5
Facebook : https://www.facebook.com/share/1Ggm5qLEMe/
Youtube : https://youtube.com/@aksharatodaytelugu?si=VLdbJOfAkp8AekoG
Twitter : https://x.com/AksharaToday