RTC Bus Accident | డ్రైవర్ నిర్లక్ష్యం.. లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు గాయాలు

పాల్వంచ మండల కేంద్రంలోని మర్రి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: RTC Bus Accident | రోడ్డు గుంతల కారణంగా నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

RTC Bus Accident | అధ్వాన రోడ్డు.. డ్రైవర్​ నిర్లక్ష్యం..

కామారెడ్డి బస్టాండ్ నుంచి సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సిరిసిల్లకు బయలుదేరింది. పాల్వంచ మండల కేంద్రంలోని మర్రి వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది. రహదారి గుంతలుగా మారి అధ్వానంగా ఉండటంతో లారీ డ్రైవర్ నెమ్మదిగా వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే లారీని ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బస్సు ముందుభాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా కామారెడ్డి జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

akshara today .jpgaccident

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *