అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Kavitha Panchajanya Sabha | తాను పిరికిదాన్ని కాదని.. పిడికిలి బిగించి మీముందుకొచ్చానని టీఆర్ఎస్ (TRS) పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha ) పేర్కొన్నారు. నగరంలోని (Nizamabad) ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ప్రసంగించారు.
Kavitha Panchajanya Sabha | కాళేశ్వరంతో జిల్లాలో ఒక్క ఎకరమైనా పండిందా..
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరం అయినా పండిందా అని కవిత ప్రశ్నించారు. అలాంటి ప్రాజెక్ట్ కట్టి ఎందుకు కవిత ప్రశ్నించారు. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావాలంటే కొత్త శక్తి రావాల్సిందేనన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఎవరి బతుకులు మారలేదన్నారు. కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు నిజామాబాద్ ప్రజలు ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
Kavitha Panchajanya Sabha | కన్నీటి పర్యంతమైన కవిత..
తానే ఏం తప్పు చేశానని తీహార్ జైల్లో పెట్టారని కవిత ప్రశ్నించారు. నాలుగేళ్లు ఈడీ, సీబీఐ తనను వేధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకంగా సీబీఐ అధికారిపైనే ఎంక్వైరీ వేయించారన్నారు. అయితే చేయని తప్పుకు జైలుకు వెళ్తే.. కడుపులో పెట్టుకోవాల్సిన పుట్టినిళ్లు లాంటి పార్టీ తనను గెంటేసిందన్నారు. తన అత్తిళ్లు అయిన ఇందూరు అక్కున చేర్చుకుందన్నారు.
Kavitha Panchajanya Sabha | ప్రశాంత్‌రెడ్డికి నా ఉసురు తగులుతది..
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని కవిత అన్నారు. అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఏం చేస్తోందని బీఆర్ఎస్ను దుయ్యబట్టారు. అందుకే ప్రజల పక్షాన ప్రశ్నించేందుకే తాను వచ్చానన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిపై కవితి నిప్పులు చెరిగారు. తండ్రీ కూతురిని విడదీసిన ఉసురు తగులుతుందన్నారు. ప్రశాంత్‌రెడ్డిని జీవితంలో క్షమించేదని లేదన్నారు. పైగా ప్రశాంత్‌రెడ్డి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే ముకందరెడ్డి అనే వ్యక్తితో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు బేరసారాలు ఆడారని ఆరోపించారు. తాను ఎంపీగా నిలబెడితే అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కక్షకట్టి ఓడించారన్నారు. మొదటి సారి పోటీచేసినప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌ను 2023లో అఫిడవిట్‌ను ప్రశాంత్‌రెడ్డి చూపిస్తే ఎంత అవినీతి జరిగిందో తేలిపోతుందన్నారు.
‘పాంచజన్యం’తో మీ ముందుకు..
తెలంగాణ రాష్ట్ర ఆదాయం రూ.2 లక్షల కోట్లని.. దాంతో అద్భుత ప్రగతి సాధించవచ్చని కవిత పేర్కొన్నారు. ఒక్క లక్ష కోట్లు ఖర్చు పెడితే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించవచ్చన్నారు. అందుకే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాంచజన్య పథకాలను ప్రకటిస్తున్నామన్నారు. ఉచిత విద్య ,ఉచిత వైద్యం , సామాజిక న్యాయం, వ్యవసాయం, ఉపాధి ఇవే మా పాంచ జన్య సూత్రాలను సభాముఖంగా ప్రకటించారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో భూలక్ష్మి కింద ఒక ఎకరం భూమి ఇస్తామని పేర్కొన్నారు. 22ఏ ద్వారా ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీపై కేసీఆర్ హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. కేటీఆర్ స్నేహితుడికి ఆ ఫ్యాక్టరీని అప్పజెప్పే కుట్ర జరిగిందని ఆరోపించారు.
కాంగ్రెస్‌లో చేరేందుకు అర్వింద్ ప్రయత్నాలు
ఎంపీ అర్వింద్‌కు ఇందూరుపై ఏం బాధ్యత ఉందని కవిత ప్రశ్నించారు. ఏళ్లుగా సాగుతున్న మాధవ నగర్ వంతెనపై బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంపై సెటైర్లు వేశారన్నారు. మరి ఆయన వంతెన కోసం చేసింది ఏమున్నదని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం రేవంత్‌రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని.. మాట్లాడితే బూతులు తప్ప వేరే ముచ్చట లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నారు. టీఆర్ఎస్ స్థాపించింది బంగారు తెలంగాణ కోసం కాదని బహుజన తెలంగాణ కావాలన్నారు. రాష్ట్రంలో కొత్త నాయకత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్‌ను సిద్దిపేట అక్కున చేర్చుకున్నట్లుగా.. బహుజన తెలంగాణ కోసం బయటకు వచ్చిన తనకు ఇందూరు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఒక్కొక్కరి అవినీతి బయటకు తీస్తా…
ఇందూరులో ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు అన్నీ బయటకు తీస్తానని కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి అక్రమంగా చేస్తున్న ఇటుక దందాను. అర్బన్‌లో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ నాయకులతో కలిసి కుమ్మక్కై కడుతున్న బిల్డింగ్‌ల బాగోతాలు బయట పెడతానన్నారు. అలాగే ప్రశాంత్‌రెడ్డి అక్రమ క్వారీలు, గంజాయి దందాను అధారాలతో చూపిస్తానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: సమర శంఖం పూరించిన కవిత