అక్షరటుడే, ముప్కాల్/కమ్మర్పల్లి: Mupkal Kammerpally Results | ఎస్సెస్సీ ఫలితాల్లో ముప్కాల్, కమ్మర్పల్లి విద్యార్థులు (Kammarpalli Students) తమ ప్రతిభ చాటారు. ముప్కాల్ మండలంలో 201 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే కమ్మర్పల్లిలో 341 మంది మంది పరీక్షలు రాయగా.. 336 మంది పాస్ కగా.. 98.50 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Mupkal Kammerpally Results | ముప్కాల్ మండలంలో..
మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముప్కాల్ (Mupkal)కు చెందిన విద్యార్థిని సీహెచ్ లాస్య 558 మార్కులతో మొదటి స్థానం సాధించింది. రెండో స్థానంలో విజ్ఞాన్ పాఠశాల విద్యార్థిని 554 మార్కులు సాధించింది. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండలంలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని ఎంఈవో గంగారాం తెలిపారు.
Mupkal Kammerpally Results | కమ్మర్పల్లిలో..
మండలంలోని జడ్పీహెచ్ఎస్ ఉప్లూర్లో 91.30శాతం, జడ్పీహెచ్ కమ్మర్పల్లి 96శాతం, జడ్పీహెచ్ఎస్ హాసాకొత్తూరు వందశాతం, చౌట్పల్లి జడ్పీహెచ్ఎస్ వందశాతం, బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ వందశాతం, కొనసముందర్ జడ్పీహెచ్ఎస్ 98.5 శాతం, కోనాపూర్ జడ్పీహెచ్ఎస్ వందశాతం, అమీర్నగర్ ఎంపీహెచ్ఎస్ వందశాతం, కమ్మర్పల్లి జీజీబీవీ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో శ్రీ విద్యాసాయి హై స్కూల్, మిసిమి ఉన్నత పాఠశాల, విజ్ఞాన్ ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ఉషాజ్యోతి హై స్కూల్లో విద్యార్థులు 98.7శాతం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎంఈవో ఆంధ్రయ్య అభినందనలు తెలియజేశారు.
Mupkal Kammerpally Results | ప్రభుత్వ పాఠశాలల్లో..
కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని శాలిని 568 మార్కులు సాధించింది. అలాగే జడ్పీహెచ్ఎస్ కోనసముందర్ విద్యార్థి అభినయ్ ద్వితీయస్థానంలో, జడ్పీహెచ్ఎస్ కమ్మర్పల్లి విద్యార్థిని శ్రీజ తృతీయస్థానంలో నిలిచింది.
ఇది కూడా చదవండి..: Running Championship | ఇంటర్నేషనల్ రన్నింగ్ ఛాంపియన్‌గా అన్నాసాగర్ యువకుడు మధు

