KTR Farmer Assurance | రైతులకు రేవంత్ ఇచ్చేది ‘వాయిదాల’ భరోసానేనా..?: కేటీఆర్

shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్: KTR Farmer Assurance | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) రైతులపై నిజంగానే ప్రేమ ఉంటే, వారికి రావాల్సిన ‘రైతు భరోసా’ నిధులను వాయిదాల పద్ధతిలో ఎందుకు చెల్లిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో (BRS) చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

KTR Farmer Assurance | రైతు బంధు ఎక్కడ?

గతంలో ఎన్నికల సమయంలో ఎవరు వచ్చినా రైతు బంధు ఆగదని కొందరు గొప్పలు చెప్పారని, కానీ నేడు పరిస్థితి దారుణంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ప్రస్తుతం రైతు బంధు నిధులు సకాలంలో అందడం లేదని, రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా కూడా దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు.

KTR Farmer Assurance | విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది..

ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని విమర్శించారు.

KTR Farmer Assurance | అబద్ధపు హామీలతో అధికారంలోకి ..

వరుస ఓటములు, ఎమ్మెల్యేల వలసలపై కేటీఆర్ స్పందిస్తూ.. ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తల్లో కొంత నిరాశ కలగడం సహజమేనని అన్నారు. గత ప్రభుత్వంలో అసలు తప్పులే జరగలేదని తాను అనడం లేదని, కానీ కాంగ్రెస్ కేవలం అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన, ఎంపీ సీట్లు గెలవలేకపోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ బలహీనపడదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Kodandaram Elections | గత ప్రభుత్వంలో భయం నీడన బతికాం.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తాం: ప్రొఫెసర్ కోదండరాం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *